గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి దక్కింది. 2001లో చంద్రబాబు హయాంలో గచ్చిబౌలి స్టేడియం నిర్మాణం కోసం హెచ్‌సీయూకి చెందిన 2300 ఎకరాల నుంచి 40 ఎకరాలు తీసుకున్నారు. అలాగే, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎంజీ భారత్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని హెచ్‌సీయూ భూమిలో నుంచి మరో 400 ఎకరాలు కేటాయించారు. ఈ 400 ఎకరాల కేటాయింపును నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ నిరసనల నేపథ్యంలో గోపన్‌పల్లి పరిధిలో ప్రత్యామ్నాయంగా 400 ఎకరాలు కేటాయించారు. అనంతరం.. గోపన్‌పల్లిలో కేటాయించిన భూమిలో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెమెంటల్ రీసెర్చ్, ఎనిమల్ బయో టెక్నాలజీ రీసెర్చ్ కోసం 250 ఎకరాలు మంజూరు చేశారు. ఇదే భూమిలో టీఎన్‌జీవో (TNGO) కాలనీల కోసం రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు.
READ MORE: Meerut Murder Case: కానిస్టేబుల్‌కు నిందితురాలు ముస్కాన్ ముద్దు.. వైరల్ వీడియోపై అధికారుల సీరియస్
అయితే, స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం ఐఎంజీ భారత్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రాజశేఖర్‌రెడ్డి హయాంలోని ప్రభుత్వం టెండర్లు రద్దు చేసింది. ఈ టెండర్లలో అక్రమాలు జరిగాయని పేర్కొంది. IMG భారత్ సంస్థ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించింది. తాజాగా కోర్టు తీర్పు ఐఎంజీ భారత్‌కు వ్యతిరేకంగా వచ్చింది. టెండర్లు రద్దు చేయడం సరైన నిర్ణయమేనని కోర్టు వెల్లడించింది. ఆ 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఈ 400 ఎకరాలను వేలం వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిని నిరసిస్తూ హచ్‌సీయూ విద్యార్థులు మరోసారి ఆందోళన చేపట్టారు.
READ MORE: Akhilesh Yadav: యూపీలో ఈద్ ప్రార్థనలపై గందరగోళం.. అఖిలేష్ యాదవ్ ఏమన్నారంటే?