జలసౌధలో కరీంనగర్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఇంఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. జిల్లాలో పెండింగ్ పనులు, అభివృద్ధి ప్రతిపాదనలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది.
సమగ్ర కుటుంబ(ఆర్థిక, రాజకీయ, విద్య, సామాజిక, న్యాయ) సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధ్యయనానికి సామాజికవేత్తలతో స్వతంత్ర హోదాతో కమిటీ ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సమగ్ర సర్వే సమాచారాన్ని విశ్లేషణ చేసి చిన్న పొరపాటుకు అవకాశం లేకుండా మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు కృషి చేయాలని కోరారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ రోజు మహిళలందరికీ శుభ దినం అని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని అభిప్రాయపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందని పేర్కొన్నారు. ఉచిత ప్రయాణమే కాకుండా ఆ బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయడం ప్రజా ప్రభుత్వం చేపట్టిన విజయమన్నారు.…
రేపు (శనివారం) ప్రజా భవన్లో అన్ని పార్టీల ఎంపీల సమావేశం జరగనుంది. కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణలో భారీగా ఐపీఎస్లు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 6 గంటలుగా కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. క్యాబినెట్ లో అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశ తేదీల ఖరారు అంశంపై సీఎం రేవంత్రెడ్డి మంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో జరిగింది. రెండు గంటలకు పైగా సమావేశం కొనసాగింది. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయ పరమైన చిక్కులు లేకుండా న్యాయ నిపుణుల సలహాలతో బిల్లు ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో యాసంగి పంట సాగుకు సరిపడ సాగు నీరు అందించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో.. యాసంగి సీజన్ పంట సాగు, రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలపై సీఎస్ సమీక్ష నిర్వహించారు.
సోమవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా ఇతర ఉన్నతాధికారులతో విద్యా సంస్కరణలపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. ఒకప్పుడు ప్రపంచానికి ప్రతిభావంతులను అందించిన ప్రభుత్వ స్కూళ్లు ఎందు వల్లనో ఇప్పుడా పరిస్థితిలో లేవని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ చొరవతో సింగరేణి వ్యాపార విస్తరణలో మరో ముందడుగు పడనుంది. నేడు రాజస్థాన్ విద్యుత్ శాఖతో 3100 మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టులపై సింగరేణి చరిత్రాత్మక ఒప్పందం జరగనుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సమక్షంలో ఎంఓయు చేసుకోనున్నారు.