హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంలో చిన్న చిన్న అమ్మాయిలను మెడలు పట్టుకుని గుంజుకుపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “తెలంగాణ సమాజం బాధ పడుతుంది. సీఎం కి కనీస మానవత్వం లేదు.. మా భూములను అమ్మకండి అని విద్యార్థులు అడిగితే అమానుషంగా వ్యవహరించారు. ఈ నెల గడవాలి అంటే హెచ్‌సీయూ భూములు అమ్మాలి. భూములు అమ్మకుంటే ప్రభుత్వ పాలన సాగదు. ఏబీవీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్‌లో కూడా కొట్టారు. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఇంకా ఎక్కువ అరాచకం చేస్తుంది. పోలీసులు విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేశారు. విద్యా కమిషన్ నోర్లు ఏడ పోయింది. అర్బన్ నక్సలైట్ లతో నింపారు. ప్రజా సమస్యల పైన, మావోయిస్టు భావజాలం ఉన్న మీరు ఎందుకు మాట్లాడడం లేదు. వీళ్ళకు వాటా వస్తుంది.. కమిషన్ వస్తుంది కాబట్టే మాట్లాడడం లేదు.. భూములు అమ్మి పాలించేది ఏంది?” అని కేంద్ర మంత్రి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
READ MORE: Mamata Banerjee: బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతుంది.. ప్రజలు రెచ్చగొట్టే చర్యలను ప్రతిఘటించాలి!
5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తుందా? రాష్ట్రం ఇస్తుందా స్పష్టం చేయాలని బండి సంజయ్ అన్నారు. రూ.10 వేల కోట్లు కేంద్రం ఇస్తుందా? లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. అదనంగా పది రూపాయలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం హంగు ఆర్భాటాలు చేస్తుందని విమర్శించారు. రేషన్ షాపులకు వెళ్లి బియ్యాన్ని తనిఖీ చేయాలని బీజేపీ కార్యకర్తలను కోరారు. ప్రతి కిలోకి 40 రూపాయలు కేంద్రం ఇస్తుందని చెప్పాలన్నారు. మోడీ పోటో ఎందుకు పెట్టరు? అని ప్రశ్నించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 పార్టీలు ఒకటి అయ్యాయని ఆరోపించారు. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒకటే అని విమర్శించారు… కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఓట్లు ఉన్న పోటీ చేయడం లేదని… ఎంఐఎంను గెలిపించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. గ్రూప్ వన్ అభ్యర్థుల అభ్యంతరాలు పరిగణన లోకి తీసుకోవాలని.. ఎవరికి అన్యాయం జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. న్యాయ విచారణ జరపాలని సూచించారు.