Team India: బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను నెగ్గడానికి టీమిండియా తల ప్రాణం తోకకు వచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా రెండో టెస్టులో ఓటమి దిశగా సాగి భారత ఆటగాళ్లు కలవరపెట్టారు. అయితే అద్భుత ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్, ఆల్‌రౌండర్ అశ్విన్ భారత్ పరువు కాపాడారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి విజయతీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆడే తదుపరి సిరీస్‌పై అందరి కన్ను పడింది. స్వదేశంలో శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా…
IND Vs BAN: మీర్పూర్ టెస్టులో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి టీమిండియా ఆపసోపాలు పడుతోంది. బంగ్లాదేశ్ విధించిన 145 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి కేవలం 45 పరుగులు చేసింది. కీలక ఆటగాళ్లు కేఎల్ రాహుల్ (2), శుభ్‌మన్ గిల్ (7), పుజారా (6), విరాట్ కోహ్లీ (1) పెవిలియన్ చేరారు. క్రీజులో అక్షర్ పటేల్ (26), జైదేవ్ ఉనద్కట్ (3) ఉన్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో…
IND Vs BAN: మీర్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 70.2 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. ఓవరాల్‌గా బంగ్లాదేశ్ 144 పరుగుల ఆధిక్యం సంపాదించింది. దీంతో టీమిండియా ముందు 145 పరుగుల టార్గెట్ నిలిచింది. లిటన్ దాస్ 73, జకీర్ హసన్ 51 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్, సిరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఉమేష్ యాదవ్, జైదేవ్ ఉనద్కట్…
IND Vs BAN: మీర్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులకు ఆలౌటైంది. దీంతో 87 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. రిషబ్ పంత్ (93), శ్రేయస్ అయ్యర్ (87) సెంచరీలు మిస్ చేసుకున్నారు. వీళ్లిద్దరూ రాణించకపోయి ఉంటే టీమిండియా పరిస్థితి దారుణంగా ఉండేది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (10), శుభ్‌మన్ గిల్ (20) విఫలం అయ్యారు. స్టార్ ఆటగాళ్లు పుజారా (24), విరాట్ కోహ్లీ (24) రాణించలేకపోయారు. అయితే…
Team India: టీమిండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టీ20 క్రికెట్లో దుమ్మురేపుతున్నాడు. ఐసీసీ ర్యాంకుల్లోనూ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. బంతి ఎటువైపు వేసినా సూర్యకుమార్ సిక్సర్లు దంచుతున్నాడు. వినూత్నమైన షాట్లతో అలరిస్తున్నాడు. అతడి స్ట్రైక్‌రేట్‌తో పాటు యావరేజ్ కూడా ఎక్కువగానే ఉంటోంది. టీ20 క్రికెట్ తరహాలో సూర్యకుమార్ వన్డేల్లోనూ తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే అతడు టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మిడిలార్డర్లో అతడికి అవకాశం ఇస్తారని అంటున్నారు. Read…
Team India: టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు న్యూజిలాండ్ పర్యటన నుంచి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అయితే బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో రెండో వన్డేలో రోహిత్ గాయపడ్డాడు. స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఎడ్జ్ తీసుకొని తనవైపు వచ్చిన బంతిని పట్టుకునే ప్రయత్నంలో అది రోహిత్ బొటనవేలిని బలంగా తాకింది. ఈ క్రమంలో అతడు క్యాచ్ కూడా జారవిడిచాడు. అప్పటికే బొటన వేలి నుంచి రక్తం కారుతుండటంతో మైదానం వీడాడు. వెంటనే…
FIFA World Cup: క్రికెట్లో టీమిండియా ఆటగాడు సచిన్ టెండూల్కర్‌కు ఎంత క్రేజ్ ఉందో.. ఫుట్‌బాల్‌లో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీకి కూడా అంతే క్రేజ్ ఉంది. వీళ్లిద్దరూ తమ ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అయితే వీళ్లిద్దరికీ అనేక సారూప్యతలు ఉన్నాయి. క్రికెట్లో సచిన్ జెర్సీ నంబర్ 10 అయితే.. ఫుట్‌బాల్‌లో మెస్సీ జెర్సీ నంబర్ కూడా 10. వీళ్ల మధ్య ఇంకా చాలా పోలికలు కనిపిస్తున్నాయి. 2003లో ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత మళ్లీ…
IND Vs BAN: ఛటోగ్రామ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ పోరాడుతోంది. 513 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నాలుగో రోజు లంచ్ సమయానికి వికెట్ నష్టపోకుండా రెండో ఇన్నింగ్స్‌లో 119 పరుగులు చేసింది. ఓపెనర్లు జాకీర్ హసన్ (55), నజ్ముల్ హుస్సేన్ శాంతనో (64) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లాదేశ్ వికెట్లు తీయాలని టీమిండియా మూడో రోజు మూడో సెషన్లోనే తన రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా బంగ్లాదేశ్ మాత్రం ఊహలకు…
Team India: టీమిండియా సీనియర్ క్రికెటర్ పుజారా చాన్నాళ్ల తర్వాత సెంచరీ చేశాడు. ఒక క్రికెటర్ జీవితంలో నాలుగేళ్ల కాలం చాలా విలువైంది. ఈ నాలుగేళ్ల కాలంలో ఏమైనా జరగొచ్చు. అయితే పుజారా మాత్రం ఎంతో సహనం ప్రదర్శించి నిలకడగా ఆడుతున్నాడు. ఒకానొక దశలో జట్టులో స్థానం కోల్పోయినా మనోనిబ్బరం కోల్పోకుండా కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. 2019 జనవరిలో సెంచరీ చేసిన పుజారా.. సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్‌పై సెంచరీ బాది విమర్శకుల నోళ్లను మూయించాడు. 1,443…