భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. క్రీజులో అజింక్య రహానె (20), విరాట్ కోహ్లి(44) లు ఉన్నారు. టీమ్ఇండియా విజయం సాధించాలంటే లాస్ట్ డే 90 ఓవర్లలో 280 పరుగులు అవసరం కాగా.. ఆస్ట్రేలియా గెలవాలంటే 7 వికెట్లు తీయాలి.
Read Also: National Politics: ఎంత విధేయత చూపినా కొడుకు లేదా కూతురికే రాజ్యాధికారం
టీమ్ఇండియా డ్రా కోసం కాకుండా విజయం కోసం ఆడుతున్నట్లు కనబడుతుంది. 444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ(60 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 43 పరుగులు ), శుభ్‌మన్ గిల్(19 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు)లు దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అయితే వీరిద్దరు 7.1 ఓవర్లలోనే తొలి వికెట్ కు 41 పరుగుల భాగస్వామ్యం జోడించారు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో మరోసారి శుబ్ మన్ గిల్ తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరాడు.
Read Also: Group-1 Exam: నేడే గ్రూప్-1 పరీక్ష.. 15 నిమిషాల ముందే గేట్లు బంద్..
శుబ్ మన్ గిల్ ఔటైనా కూడా రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు. అతడికి పుజారా(27; 47 బంతుల్లో 5 ఫోర్లు) జత కలిశాడు. వీరిద్దరు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు పెవిలియన్‌కు చేరుకున్నారు. నాథన్ లయన్ బౌలింగ్‌లో రోహిత్ ఔట్ కాగా ఆ మరుసటి ఓవర్లోనే పుజరాను కమిన్స్ బోల్తా కొట్టించాడు. దీంతో 93 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది.
Read Also: Cyclone Biparjoy: తీవ్రమైన బిపర్ జోయ్ తుపాన్.. రానున్న 24గంటలు జాగ్రత్త
విరాట్ కోహ్లి, అజింక్యా రహానెలు ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. ఈ ఇరువురు మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. అభేధ్యమైన నాలుగో వికెట్‌కు వీరిద్దరు 71 పరుగులు జోడించారు. ఆఖరి రోజు వీరిద్దరు ఎంత సేపు క్రీజులో ఉంటారు అన్న దానిపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
Read Also: Viral News : బాత్‌రూమ్‌లోకి మొబైల్ తీసుకెళ్లిన అమ్మాయి.. చివరికి లెటర్ తో..
అంతముందు 123/4 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియా 270/8 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బ్యాటర్లలో అలెక్స్ కేరీ(66 నాటౌట్) హాఫ్ సెంచరీతో అలరించగా మిచెల్ స్టార్క్ 41 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.