BCCI Plans to sack Rohit Sharma after West Indies Tour: ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియాతో ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో భారత్ ఘోర పరాజయంను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన కేవలం 234 పరుగులకే ఆలౌటై.. దారుణంగా ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో తేలిపోయిన టీమిండియా.. డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండోసారి కూడా అభిమానులను నిరాశపరిచింది. ఈ ఓటమికి రోహిత్ శర్మ కెప్టెన్సీ కూడా ఓ కారణమనే చెప్పాలి. టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకోవడం, ఫీల్డర్లను సరిగా ఉపయోగించుకోకపోవడంతో పాటు బ్యాటింగ్‌లో కూడా విఫలమయ్యాడు. దాంతో కెప్టెన్‌గా రోహిత్‌ను తొలగించాలని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
త్వరలో వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మకు చివరిదని పలువురు అంటున్నారు. విండీస్ సిరీస్ తర్వాత భారత జట్టుకు కొత్త కెప్టెన్ (Team India New Captain) వస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే హిట్‌మ్యాన్ వయసు 36 సంవత్సరాలు. మరో డబ్ల్యూటీసీ ఫైనల్ వచ్చే సమయానికి రోహిత్ వయసు 38 అవుతుంది. ఆ వయసులో కెప్టెన్సీ చేయడం చాలా చాలా కష్టం. ఇప్పటికే ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న హిట్‌మ్యాన్.. 38 ఏళ్ల వయసులో ఎంత ఫిట్‌గా ఉంటాడనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ స్థానంలో భారత సారథిగా కేఎల్ రాహుల్ (KL Rahul) వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Also Read: Xiaomi Electric Car: షియోమీ నుంచి మొదటి ఎలక్ట్రిక్ కారు.. సూపర్ లుకింగ్! కొనకుండా అస్సలు ఉండలేరు
రోహిత్ శర్మను కెప్టెన్‌గా తొలగిస్తున్నాం అనే వార్తలు ఏమాత్రం నిజం కాదని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. ‘రోహిత్ శర్మను కెప్టెన్‌గా తొలగిస్తున్నామనే వార్తలు నిజం కాదు. వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు అతడు ఆడతాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకమే. అయితే రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాలనే ఆలోచన చేయలేదు. వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు రోహిత్ వయసు 38 అవుతుంది. అప్పటికి బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఓ నిర్ణయం తీసుకుంటుందనుకుంటున్నాం. వెస్టిండీస్ టూర్ తర్వాత రోహిత్ ఫామ్‌ను బట్టి సెలెక్షన్ కమిటీ ఒక నిర్ణయానికి వస్తుంది’ అని బీసీసీఐ అధికారి తెలిపారు.
‘వెస్టిండీస్ టూర్ తర్వాత డిసెంబరు వరకు భారత జట్టు టెస్టులు ఆడదు. 2023 ప్రపంచకప్ అనంతరం డిసెంబరులో దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా వెళ్తుంది. కెప్టెన్సీ విషయంలో సెలెక్షన్ కమిటీ ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం ఉంది’ అని బీసీసీఐ అధికారి చెప్పుకొచ్చారు. జూలై 12 నుంచి విండీస్-భారత్ టూర్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఇరు జట్లు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడతాయి.
Also Read: iPhone 15 Launch: యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 15 లాంచ్ డేట్ అప్పుడే! ధర, ఫీచర్ల వివరాలు ఇవే