IND Vs BAN: ఛటోగ్రామ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులోని తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ కుప్పకూలింది. 133/8 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఉదయం సెషన్లో ఆట ప్రారంభమైన కాసేపటికే బంగ్లాదేశ్ 150 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్ కుల్దీప్ 5 వికెట్లతో విజృంభించాడు. 28 పరుగులు చేసిన ముష్పీకర్ రహీమ్ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. మెహిదీ హసన్ మిరాజ్ 25 పరుగులు, లిట్టన్ దాస్ 24 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో కుల్దీప్…
IND Vs BAN: ఛటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆరంభంలోనే టీమిండియా కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించలేకపోయారు. కేఎల్ రాహుల్ (22), శుభ్‌మన్ గిల్ (20) విఫలమయ్యారు. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా ఒక్క పరుగు చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. దీంతో తొలి రోజు లంచ్ సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. లంచ్ సమయానికి క్రీజులో పుజారా (12),…
IND Vs BAN: నేటి నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. చిట్టగ్యాంగ్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఎలాగైనా టెస్టు సిరీస్‌లో గెలవాలని భావిస్తోంది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరుకోవాలంటే ఈ సిరీస్‌లో విజయం సాధించడం భారత్‌కు ఎంతో ముఖ్యం. అయితే ఈ సిరీస్‌లో టీమిండియాను గాయాలు వేధిస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వేలి గాయంతో తొలి టెస్టుకు…
Team India: టీమిండియా ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటికే రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ వంటి కీలక ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా యువ పేసర్ కూడా చేరాడు. టీమిండియా పేసర్, రాజస్థాన్ స్టార్ బౌలర్ ఖలీల్ అహ్మద్ అనారోగ్య కారణాలతో ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీకి దూరమయ్యాడు. తన అనారోగ్య పరిస్థితి గురించి ఖలీల్ అహ్మద్…
Team India: టీమిండియా యువ ఓపెనర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఒక్క ఇన్నింగ్స్‌తో సమీకరణాలన్నీ మార్చేస్తున్నాడు. బంగ్లాదేశ్‌పై మూడో వన్డేలో డబుల్ సెంచరీ చేయడంతో బీసీసీఐ దృష్టిలో కూడా పడుతున్నాడు. ఈ నేపథ్యంలో 2023-24కు సంబంధించిన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోకి ఇషాన్ కిషన్ చోటు దక్కించుకోనున్నాడు. ఈనెల 21న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్లో సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను ఖరారు చేయనున్నారు. కొన్నాళ్లుగా టీమిండియా తరఫున ఆడుతున్నా ఇషాన్ కిషన్‌కు సెంట్రల్ కాంట్రాక్టు దక్కలేదు. కానీ ఇప్పుడు…
Team India: ఈనెల 14 నుంచి బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరమయ్యాడు. ఇప్పటికే షమీ, జడేజా లాంటి ప్రధాన ఆటగాళ్లు కూడా గాయాల కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు బీసీసీఐ జట్టులో పలు మార్పులు చేసింది. రోహిత్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేసింది. అటు…
Dinesh Karthik: టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వన్డేల్లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వన్డే కెరీర్ ముగిసినట్లేనని అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్ పర్యటన అనంతరం స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో భారత్ వన్డే సిరీస్‌లు ఆడాల్సి ఉందని.. ఆ టోర్నీలకు ధావన్ జట్టులో చోటు దక్కించుకుంటాడో లేదో వేచి చూడాలన్నాడు. ఒకవేళ ఆయా సిరీస్‌లకు ధావన్‌కు చోటు దక్కకపోతే వన్డే ప్రపంచకప్‌లో కూడా అతడి స్థానం గల్లంతయినట్లే భావించాల్సి ఉంటుందని…
Team India: టీమిండియాలో ఇటీవల అన్యాయానికి గురైన క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే సంజు శాంసన్ ఒక్కడే. టీ20లలో రాణిస్తున్నా టీ20 ప్రపంచకప్ కోసం అతడిని పరిగణనలోకి తీసుకోలేదు. పోనీ ఆ టోర్నీ తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైనా శాంసన్‌కు పెద్దగా ఆడే అవకాశం కల్పించలేదు. కేవలం ఒక్కటే మ్యాచ్‌కు తుది జట్టులో స్థానం కల్పించారు. మళ్లీ ఆరో బౌలర్ కోసం శాంసన్‌ను పక్కనపెట్టారు. టీమిండియాలో ప్రస్తుతం వికెట్ కీపర్ స్థానానికి పోటీ తీవ్రంగా ఉన్న మాట వాస్తవం.…
Team India: వన్డే ఫార్మాట్లో టీమిండియా అరుదైన రికార్డు సృష్టించింది. వన్డే చరిత్రలో 300 వ్యక్తిగత సెంచరీలు చేసిన తొలి జట్టుగా టీమిండియా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు ఖాతాలో 240 వ్యక్తిగత సెంచరీలు ఉన్నాయి. పాకిస్థాన్ 214 వ్యక్తిగత సెంచరీలతో మూడో స్థానంలో, 194 వ్యక్తిగత సెంచరీలతో వెస్టిండీస్ నాలుగో స్థానంలో, 191 వ్యక్తిగత సెంచరీలతో దక్షిణాఫ్రికా ఐదో స్థానంలో, 188 వ్యక్తిగత సెంచరీలతో ఇంగ్లండ్ ఆరో…
Virat Kohli: ప్రపంచ వ్యాప్తంగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే కాకుండా దేశ విదేశాల్లో కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారు. అయితే కోహ్లీ తన పేరు మార్చుకున్నాడని తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 2017, డిసెంబర్ 11న ఇటలీలో హీరోయిన్ అనుష్క శర్మను కోహ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహం అత్యంత పకడ్బందీగా, సీక్రెట్‌గా జరిగింది. భారత క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్స్‌ను కూడా…