ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వయసు 36 ఏళ్లు. 2025లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు అతడి వయసు 38 అవుతుంది. ఆ వయసులో రోహిత్ ఆడతాడా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేం. ఇప్పటికే ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న హిట్‌మ్యాన్.. వచ్చే రెండేళ్లలో ఎంత ఫిట్‌గా ఉంటాడనేది ఆసక్తికర విషయం. ఒకవేళ రోహిత్ ఆడినా అతను కెప్టెన్‌గా మాత్రం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో రానున్న రెండేళ్లలో జరిగే టెస్టు సిరీస్‌లకు రోహిత్ కెప్టెన్‌గా ఉండకపోతే.. ఎవరు భారత సారథిగా ఉంటాడనే ప్రశ్న అభిమానుల మదిలో ఉంది. ఈ ప్రశ్నను గూగుల్ ఏఐ (Google AI)ని అడిగితే ఎవరు ఊహించని పేర్లు తెలిపింది.
గూగుల్ ఏఐ తన తొలి ఎంపిక కేఎల్ రాహుల్ అని పేర్కొంది. ‘కొన్నేళ్లుగా కేఎల్ రాహుల్ భారత జట్టులో ప్రధాన ఆటగాడిగా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులలో అయినా బ్యాటింగ్ చేయగలడు. మంచి ఫీల్డర్, కీపర్ కూడా. డొమెస్టిక్ క్రికెట్‌లో కర్నాటక.. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు కెప్టెన్‌గా పని చేశాడు. ఫామ్‌లోకి వస్తే రాహుల్‌ని ఆపడం కష్టం. భవిష్యత్తు టెస్టు క్రికెట్‌లో అతని అనుభవం జట్టుకు అవసరం. అందుకే రాహుల్ నా మొదటి ఆప్షన్’ గూగుల్ ఏఐ చెప్పింది. ఇదివరకే టీమిండియాకు కెప్టెన్‌గా పనిచేసిన రాహుల్.. మోకాలి సర్జరీ కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు.
Also Read: Hero Xtreme 160R 4V Launch: మరో కొత్త బైక్‌ను రిలీజ్ చేసిన హీరో.. సూపర్ లుకింగ్, బెస్ట్ మైలేజ్!
రెండో ఆప్షన్‌గా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను గూగుల్ ఏఐ ఎంచుకుంది. ‘ రిషబ్ పంత్ యంగ్ అండ్ డైనమిక్ క్రికెటర్. పొట్టి ఫార్మాట్‌లో పంత్ తన కెప్టెన్సీని మనకు పరిచయం చేశాడు. డొమొస్టిక్ క్రికెట్‌లో ఢిల్లీ, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు కెప్టెన్‌గా పని చేశాడు. అంతేకాదు టీమిండియాకు కూడా పలు మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా ఉన్నాడు. నా దృష్టిలో భారత్ టెస్టు కెప్టెన్‌గా పంత్ బెటర్ చాయిస్’ అని పేర్కొంది.
యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను మూడో ఆప్షన్‌గా గూగుల్ ఏఐ ఏంచుకుంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023లో టాప్ స్కోరర్‌గా నిలిచిన గిల్.. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో మాత్రం విఫలమయ్యాడు. ‘మంచి బ్యాటింగ్ టెక్నిక్ కలిగిన శుబ్‌మన్ గిల్ టెస్టు క్రికెట్‌లో కెప్టెన్‌గా సమర్థుడని నెను అనుకుంటున్నా’ అని గూగుల్ ఏఐ చెప్పుకొచ్చింది. గతంలో భారత జట్టుకు వైస్ కెప్టెన్సీ చేసిన అజింక్య రహానే పేరును గూగుల్ ఏఐ విస్మరించింది.
Also Read:Tabu Hot Pics: టబు హాట్ ఫోటోషూట్.. 50 ఏళ్ల వయసులో కూడా తగ్గేదేలే! పిక్స్ వైరల్