Sunil Gavaskar Slams Team India on WTC Final 2023 Defeat: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2023లో భారత్ దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో అన్ని విభాగాల్లో విఫలమయిన భారత్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్లపై అందరూ మండిపడుతున్నారు. వీరిద్దరిని తమ పదవుల నుంచి తొలగించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఫైనల్లో భారత్ ఓడిపోవడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడి.. బలహీన టీంపై ప్రతాపం చూపిస్తే ఏం లాభం? అని చురకలు వేశాడు.
ఓ ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ‘గతంలో భారత్ 42 పరుగులకు ఆలౌటైన జట్టులో నేను ఓ సభ్యుడిని. అప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాం. ప్రస్తుత ఆటగాళ్లు కూడా విమర్శలకు అతీతులేమీ కారు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్లో జరిగిన దాని గురించి విశ్లేషించుకోవాలి. ఎలా ఔట్ అయ్యాం, ఎందుకు సరిగా బౌలింగ్ చేయలేకపోయాం, క్యాచ్‌లు ఎందుకు పట్టలేకపోయాం అని అందరూ ఆలోచించాలి. తుది జట్టు ఎంపిక సరిగ్గా ఉందా? లేదా? అన్నది చాలా ముఖ్యం. ప్రస్తుతం లోపాలను సరిదిద్దుకోవడంపై జట్టు దృష్టి పెట్టాలి’ అని సూచించాడు.
Also Read: Sreeleela Birthday: శ్రీలీల బర్త్ డే స్పెషల్.. ‘భగవంత్ కేసరి’ నుంచి ఫస్ట్ లుక్ విడుదల! మరీ ఇంత అందమా
ఆస్ట్రేలియా వంటి మేటి జట్లపై ఓడి.. వెస్టిండీస్ వంటి జట్లపై ద్వైపాక్షిక సిరీస్ గెలవడంలో అర్థం లేదని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. బలహీన టీంపై ప్రతాపం చూపిస్తే ఏం లాభం అని చురకలు వేశాడు. ‘వెస్టిండీస్ ప్రస్తుతం మేటి జట్టు కాదు. అలంటి జట్టుపై ప్రతాపం చూపించి 2-0 లేదా 3-0తో గెలిస్తే ప్రయోజనం లేదు. ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా వంటి జట్లపై తప్పులు పునరావృతం చేస్తున్నప్పుడు ఈ విజయాలకు ఎలాంటి అర్థం ఉండదు. చేసిన తప్పులే చేస్తే ట్రోఫీ ఎలా గెలుస్తారు?’ అని సన్నీ ప్రశ్నించాడు.
Also Read: Priyamani Latest Pics: పింక్ డ్రెస్‌లో ప్రియమణి.. టాప్ టూ బాటమ్ అందాల ప్రదర్శన! పిక్స్ వైరల్