Sanjay Bangar: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కోహ్లీ చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ సెంచరీలు పూర్తి చేశాడు. ఇది చిన్న విషయం కాదని.. అతడు త్వరలోనే సచిన్‌ను కూడా దాటేస్తాడని బంగర్ వాఖ్యానించాడు. ఈ ఏడాది టీమిండియా 26 నుంచి 27 వన్డే మ్యాచ్‌లను ఆడుతుందని.. వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ చేరితే అది అదనం అన్నాడు. కాబట్టి ఈ మైలురాయిని ఈ…
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022లో భారత్ పేలవ ప్రదర్శనను సమీక్షించడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం ముంబైలో టీమిండియా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది.
BCCI: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంపై బీసీసీఐ స్పందించింది. ప్రస్తుతం పంత్ క్షేమంగా ఉన్నాడని, స్పృహలోకి వచ్చాడని పేర్కొంది. పంత్ నుదుటిపై రెండు చోట్ల లోతైన గాయాలు అయ్యాయని, కుడి మొకాలిలో లిగమెంట్ టియర్ వచ్చిందని, కుడి మణికట్టు, బొటనవేలితో పాటు వీపు భాగంలో గాయాలు అయ్యాయని బీసీసీఐ తెలిపింది. పంత్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుందని ప్రకటనలో చెప్పుకొచ్చింది. పంత్ పూర్తిగా కోలుకునే వరకు బోర్డు అండగా ఉంటుందని…
Rishab Pant Injury: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో డెహ్రాడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హరిద్వార్ జిల్లాలో మంగళూరు, నర్సన్ మధ్య ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్వయంగా కారు డ్రైవ్ చేసిన పంత్.. నిద్రమత్తులో కారు నడపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో రిషబ్ పంత్ ఒక్కడే కారులో ఉన్నాడని, కారు అద్దాలను పగలగొట్టుకొని బయటకు వచ్చాడని చెప్పారు. ప్రమాదం…
Rishab Pant: టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డుప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడు గాయాలతో డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ ఆరోగ్యంపై వైద్యులు తొలి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జన్ల పర్యవేక్షణలో క్రికెటర్ రిషబ్ పంత్ ఉన్నాడని.. అతడి కండిషన్ నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. పరీక్షలన్నీ ముగిసిన తర్వాత పూర్థిస్థాయి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని మ్యాక్స్ హాస్పిటల్ డాక్టర్…
Team India: కొత్త ఏడాది ఆరంభంలో శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు టీమిండియా సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో రెండు సిరీస్‌లకు వేర్వేరు జట్లను మంగళవారం రాత్రి సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండటంతో సీనియర్లంతా టెస్టు, వన్డే ఫార్మాట్లపై ఫోకస్ పెడతారని గతంలోనే బీసీసీఐ వర్గాలు స్పష్టం…
స్వల్పం విరామం తర్వాత టీమిండియా మళ్లీ బరిలోకి దిగనుంది. జనవరి 3 నుండి ప్రారంభమయ్యే శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు టీమ్ ఇండియా స్క్వాడ్‌ను బీసీసీఐ ప్రకటించింది.
Team India: టీమిండియా ఈ ఏడాది చివరి మ్యాచ్ ఆడేసింది. బంగ్లాదేశ్‌తో ఆడిన రెండో టెస్టు ఈ ఏడాది భారత్‌కు చివరి మ్యాచ్. మొత్తం 71 మ్యాచ్‌లు ఆడిన భారత్ 46 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 21 మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ టై కాగా మూడు మ్యాచ్‌లలో ఫలితం రాలేదు. భారత్ విజయాల శాతం 64.78గా నమోదైంది. టెస్ట్ ఫార్మాట్లో ఏడు మ్యాచ్‌లు ఆడిన భారత్ కేవలం నాలుగు మ్యాచ్‌లను మాత్రమే గెలిచింది. మూడు…
Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో 1, 19 పరుగులు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ రెండో టెస్టులోనూ విఫలమ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 24 పరుగులు చేయగా.. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే పెవిలియన్‌కు చేరి నిరాశపరిచాడు. దీంతో టెస్టు ఫార్మాట్లో గత 10 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఒక్క…
World Test Championship: బంగ్లాదేశ్‌పై రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. దీంతో భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈ ఏడాది 14 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఎనిమిది విజయాలు, నాలుగు ఓటములతో 99 పాయింట్లతో 58.93 విజయ శాతంతో రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా 13 మ్యాచ్‌ల్లో తొమ్మిది విజయాలు, ఒక ఓటమితో 120 పాయింట్లు సాధించింది.…