బంగ్లాదేశ్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన పేరు మీద రికార్డు రాసిపెట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్లు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన భారత్ తరఫున 10వ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. అంతే కాకుండా.. అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్లు పూర్తి చేసిన ఘనత సాధించిన ఆరో భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా.
Virat kohli and Gautam Gambhir Chitchat: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సందర్భంగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న కోహ్లీ., ఎల్ఎస్జి టీంకి మెంటార్‌గా ఉన్న గంభీర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చాలా రచ్చ జరిగింది. అప్పటి నుంచి ఇద్దరు ఆటగాళ్ల మధ్య మనస్పర్థలు వచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, గంభీర్ గతంలో కూడా ఈ విషయాలను పుకార్లుగా పేర్కొన్నాడు. అవేమి కాదంటూ.. కోహ్లీతో తనకి మంచి సంబంధాల గురించి మాట్లాడాడు. ఇప్పుడు…
తాము ప్రత్యర్థి గురించి ఎక్కువగా ఆలోచించమని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. బంగ్లాదేశ్ కోసం ప్రత్యేక ప్రణాళికలేమీ రచించమని, మిగతా జట్లతో ఎలా ఆడతామో బంగ్లాను కూడా అలాగే ఎదుర్కొంటామని తెలిపాడు. జట్టులోని అత్యుత్తమ ఆటగాళ్లందరూ ప్రతి మ్యాచ్‌లోనూ ఆడేలా చూడాలనుకుంటామని, కొన్నిసార్లు అది సాధ్యం కాదన్నాడు. దేశవాళీల నుంచి ఎంతో మంది యువ బౌలర్లు వెలుగులోకి వస్తుండడం శుభ పరిణామం అని రోహిత్ పేర్కొన్నాడు. బంగ్లాతో గురువారం (సెప్టెంబర్ 19) తొలి టెస్టు ఆరంభం…
Yashasvi Jaiswal Record: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ గురువారం ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 19న చెన్నైలో ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో విజయం సాధించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. డబ్ల్యూటీసీలో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డును అందుకోనున్నాడు. డబ్ల్యూటీసీ 2023-25లో…
సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. అక్టోబర్ 7 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈ టీ20 సిరీస్‌కు స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పని భారాన్ని తగ్గించే విధానంలో భాగంగా అతడిని పొట్టి సిరీస్‌లో ఆడించకూడదని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. ఈ సీజన్లో భారత్ ఆడే పది టెస్టులకు అతడు జట్టులో ఉండే అవకాశముంది. త్వరలో న్యూజిలాండ్‌తో…
టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ ఎక్స్పర్ట్ ఆకాష్ చోప్రా.. ఇటీవల టీమిండియా ప్యూచర్ ఆటగాళ్లు ఎవరో చెప్పారు. ముగ్గురు యువ ఆటగాళ్ల గురించి చెప్పారు. అందులో.. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ ఉన్నారు.
భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్పై కీలక ప్రకటన చేశాడు. తన అంతర్జాతీయ కెరీర్ భవిష్యత్తు గురించి ఓపెన్‌గా మాట్లాడాడు. ఇకపై తన ఆటను మెరుగుపరుచుకోవాలనే కోరిక లేనప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానని అశ్విన్ చెప్పాడు. రిటైర్మెంట్ ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయించుకోలేదని అని అశ్విన్ అన్నాడు.
HBD Surya Kumar Yadav: భారత క్రికెట్ జట్టు టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈరోజు తన 34వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 2021లో 31 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సూర్య ఇప్పుడు టీ20లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. క్రికెట్ భారత క్రికెట్లో మిస్టర్ 360 అని పిలవబడే సూర్య, టి20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో డేవిడ్ మిల్లర్‌ను పట్టుకోవడం ద్వారా భారతదేశం రెండవసారి ఛాంపియన్‌గా మారడంలో ముఖ్యమైన సహకారం అందించాడు. సూర్యకుమార్…
సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. అందుకోసం టీమిండియా శుక్రవారం చెన్నై చేరుకుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్లకు ఇది మొదటి టెస్ట్ సిరీస్. కావున.. టీమిండియాను గెలిపించడమే వారి లక్ష్యం. అయితే.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) భారత ఆటగాళ్లకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ODI World Cup 2023 India Economic Benefit: 2023 అక్టోబరు-నవంబరులో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. మెగా టోర్నీలో ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో టీమిండియాను ఓడించిన ఆసీస్ ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్ అభిమానులతో పాటు విదేశీయులు కూడా భారీ సంఖ్యలో ప్రత్యక్షంగా వీక్షించారు. వన్డే ప్రపంచకప్ భారత్‌కు రూ.11,637 కోట్ల ఆర్థిక ప్రయోజనాన్ని కలిగించిందని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. 2023 వన్డే…