IND vs AUS: భారత్‌తో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యతను సాధించింది. తొమ్మిది వికెట్లు కోల్పోయినా, వెనుకంజ వేయకుండా ఫైటింగ్ స్పిరిట్‌ను ప్రదర్శిస్తూ, భారత్‌పై 333 పరుగుల ఆధిక్యతను నెలకొల్పింది. మైదానంలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఇక, ఆస్ట్రేలియాకు ఇంకా ఒక వికెట్ మిగిలినందున, ఈ ఆధిక్యత మరింత పెరిగే అవకాశముంది. ఐదో రోజు తొలి సెషన్‌లో ఆస్ట్రేలియా మరొక వికెట్ తీయలేకపోతే.. భారత్ పై ఆధిక్యతను మరింతగా పెంచితే, టీమిండియా అనుకూల పరిణామాలు పొందేందుకు కష్టమే.
Also Read: MLC Kavitha: కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేక.. నాపై, కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టారు..
ఇక చివర్లో 10వ వికెట్ కు నాథన్ లియాన్ 54 బంతులను ఎదుర్కొని 41 పరుగులు సాధించాడు. అందులో ఐదు ఫోర్లు కూడా ఉన్నాయి. అలాగే స్కాట్ బోలాండ్ 65 బంతులను ఎదుర్కొని, ఒక ఫోర్ సహాయంతో 10 పరుగులు చేశాడు. వీరిద్దరూ నాలుగో రోజు నాటౌట్‌గా మిగిలారు. వీరిద్దరూ కలిసి 110 బంతులను ఎదుర్కొని 55 పరుగులు చేశారు. ఇది ఇలా ఉండగా ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఓ హైడ్రామా చోటు చేసుకుంది. నాలుగో బంతికి నాథన్ లియాన్ అవుట్ అయినా, చివరకి అది నో బాల్ అని నిర్ణయించారు. బుమ్రా వేసిన బాల్ ను డిఫెన్స్ ఆడిన లియాన్, బ్యాట్ ఎడ్జ్ తీసుకుని ఆ బంతి థర్డ్ స్లిప్ వైపు గాల్లోకి ఎగిరింది. అక్కడే ఉన్న కేఎల్ రాహుల్ దాన్ని క్యాచ్ చేశారు. అయితే, అది నో బాల్ కావడంతో అవుట్ అని అందరూ భావించినప్పటికీ, అవుట్ కాకుండా ఇన్నింగ్‌కు మరింత ఆలస్యం జరిగింది. చూడాలి మరి సోమవారం టీమిండియాకు ఎంతవరకు కలిసి వస్తుందో.