ఐపీఎల్ 2025 మెగా వేలంకు సంబంధించిన రిటెన్షన్ రూల్స్‌ను ఇటీవల ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి రిటెన్షన్ పరిమితిని ఆరుగురు ఆటగాళ్లకు పెంచింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఆప్షన్ ఉంది. అక్టోబర్ 31వ తేదీ లోపు అన్ని ఫ్రాంచైజీలు రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. వేలం నవంబర్ మూడో వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వేలం సందర్భంగా ప్రాంచైజీలకు పెద్ద బొక్క పడే అవకాశం…
ఏ జట్టుకైనా అత్యుత్తమ ఫినిషర్ అవసరం కానీ.. టీమిండియాకు మాత్రం డబుల్ ధమాకా లాంటి ఇద్దరు ఫినిషర్లు ఉన్నారని భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్ బెస్ట్ ఫినిషర్లు అవుతారన్నాడు. వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు అత్యంత కీలక పాత్ర పోషిస్తారని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో ఆల్ ఫార్మాట్ బెస్ట్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అని డీకే చెప్పుకొచ్చాడు. నేడు బంగ్లాదేశ్‌తో భారత్…
టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ టాప్ ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత.. మరో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. బుమ్రా ఇటీవల బంగ్లాదేశ్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో.. ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్లో మరో పదేళ్లు భారత జట్టుకు ఎలాంటి డోకా లేదని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (బీసీఈ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. మరో పదేళ్లు భారత్ ఆధిపత్యం చెలాయించడానికి కావాల్సినంత మంది ఆటగాళ్లు దేశంలో ఉన్నారన్నారు. పురుషుల్లోనే కాదు మహిళల క్రికెట్లో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారని చెప్పారు. టీ20 ప్రపంచకప్ 2024 కోసం బీసీఈ శిక్షణ శిబిరంలో భారత మహిళల జట్టు తీవ్రంగా శ్రమించిందని లక్ష్మణ్ తెలిపారు. బీసీఈ కొత్త సెంటర్‌ను ప్రారంభించిన…
టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా రికార్డుల మోత మోగించింది. టెస్టుల్లో అత్యంత వేగంగా 50, 100, 150, 200 పరుగులు చేసిన జట్టుగా భారత్ అవతరించింది. కేవలం 3 ఓవర్లలోనే 50 రన్స్ చేసి వరల్డ్ రికార్డు నమోదు చేసిన రోహిత్, జైస్వాల్ జోడీ.. ఆ తర్వాత అత్యంత వేగంగా 100, 150, 200 రన్స్ కూడా భారత్ చేసింది.
భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్లో రోజురోజుకు కొత్త శిఖరాలను చేరుకుంటున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అతను తన పేరిట ఒక పెద్ద రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
2007 September 24 is Special Day For Team India: 2007 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్లోనే బంగ్లాదేశ్‌తో చేతిలో ఓడిన భారత జట్టు.. మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అదే ఏడాది టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టులో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ వంటి సీనియర్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని యువ భారత జట్టుపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ ప్రపంచంలో మేటి…
బంగ్లాదేశ్‌పై టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతేకాకుండా.. భారత జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారిగా టెస్టు క్రికెట్లో ఓడిన దానికంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది.
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 అక్టోబరు 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. భారత్ అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న జరగనుంది. ఇక 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. భారత మహిళల జట్టు ప్రస్తుతం బెంగళూరులోని ఏన్సీఏలో ప్రాక్టీస్ చేస్తోంది. టైటిల్ లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. అయితే భారత జట్టును…
బంగ్లాదేశ్‌తో జరిగిన చెన్నై టెస్టులో టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ టెస్టుల్లో 5వ సెంచరీ సాధించాడు. 119 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో గిల్ 10 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో 100 సిక్సర్ల మార్కును కూడా దాటేశాడు.