ప్రస్తుతం భారత్‌లో ఒక్క నాణ్యమైన స్పిన్నర్ లేడని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. భారత్ నుంచి అత్యుత్తమ స్పిన్నర్లు రాకపోవడానికి కారణం ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడటమే అని పేర్కొన్నాడు. ప్రస్తుత స్పిన్నర్లు బంతిని సరిగ్గా ఫ్లై చేసి వికెట్లను తీయలేకపోతున్నారని వీరూ చెప్పుకొచ్చాడు. భారత బ్యాటర్లు సరిగ్గా స్పిన్‌ను ఎదుర్కోలేకపోవడంపై సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత బ్యాటర్లు అందరూ స్పిన్‌కు దాసోహమమైన విషయం…
WTC Final 2025: ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఫైనల్ జూన్ 11 నుండి 15, 2025 వరకు లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతుందని.., అలాగే జూన్ 16 రిజర్వ్ డేగా ఉంటుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం మీడియాకు తెలియజేసింది. అంటే 2023తో పోలిస్తే ఈసారి IPL ఫైనల్ కు WTC ఫైనల్ కు మధ్య కొంచెం ఎక్కువ గ్యాప్ ఉండవచ్చు. క్వాలిఫికేషన్‌ను నిర్ణయించే పర్సంటేజీ పాయింట్ల ప్రకారం భారత్ ప్రస్తుతం టెస్ట్ స్టాండింగ్‌లలో…
PAK vs BAN: రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ జట్టును ఓడించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్‌ను ఓడించడం ఇదే తొలిసారి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) లో బంగ్లాదేశ్‌కు ఇది 3వ విజయం కాగా.., ప్రస్తుత వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ రౌండప్ లో పాకిస్థాన్‌కి 5వ ఓటమి. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన…
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ కెరీర్ మొదట్లో తనతో జరిపిన సంభాషణను వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తాజాగా గుర్తుచేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ అరంగేట్రంలో షార్ట్ బాల్‌లకు అవుట్ అయిన విరాట్ తీవ్ర నిరాశకు గురయ్యాడని, తాను సరిగ్గా బ్యాటింగ్ చేయలేనా? అనే అనుమానాలు పెంచుకున్నాడని తెలిపాడు. టెస్ట్ క్రికెట్లో పది వేల పరుగులు చేయకపోతే నువ్వు సిగ్గుపడాలని తాను కోహ్లీతో అన్నానని భజ్జి చెప్పుకొచ్చాడు. తరువార్ కోహ్లీ పోడ్కాస్ట్లో కోహ్లీకి సంబంధించిన పలు విషయాలను హర్భజన్…
T Dilip About Rohit Sharma: ఐపీఎల్ పాత ప్రాంచైజీ డెక్కన్ ఛార్జర్స్‌లో ఉన్నప్పుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో తనకు అంతగా ఇంటరాక్షన్ లేదని భారత ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ తెలిపాడు. గత మూడు సంవత్సరాలుగా భారత జట్టులో రోహిత్‌తో ఎక్కువ సమయం గడిపానని, అతని లాంటి మంచి మనుషులను జీవితంలో చాలా తక్కువ మందిని చూశానన్నాడు. హిట్‌మ్యాన్ చాలా ఫన్నీగా ఉండటమే కాకుండా మైదానంలో ఆటను ఎంజాయ్ చేస్తాడని దిలీప్ చెప్పుకొచ్చాడు. రోహిత్…
Mohammed Shami About ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో భారత జట్టు ఫైనల్‌కు చేరడంలో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 7 మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లు పడగొట్టి.. మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన వీరుడిగా నిలిచాడు. అయితే టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో షమీకి తుది జట్టులో అవకాశం దక్కలేదు. హార్దిక్ పాండ్యా గాయపడిన తర్వాత ఛాన్స్ వచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. తానెంత…
Gautam Gambhir: టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన ఆల్ టైమ్ భారత వన్డే జట్టును ప్రకటించారు. దీనికి సారథిగా మహేంద్ర సింగ్ ధోనినీ ఎంచుకున్నారు. అయితే, ఈ జట్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు చోటు ఇవ్వలేదు.
భారత పిచ్‌లపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. మనం గెలవాలని కోరుకోవడంలో తప్పు లేదని, కేవలం మూడు రోజుల్లోపే మ్యాచ్‌ను సొంతం చేసుకోవాలనే ఆలోచన మాత్రం సరికాదన్నారు. తొలి రోజు నుంచే స్పిన్ పిచ్‌లను రూపొందించడం వల్ల బ్యాటర్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందన్నారు. పేస్‌తో పాటు స్పిన్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లను తయారుచేసి ఆడితే బాగుంటుందని హర్భజన్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 19 నుంచి భారత్ వేదికగా బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.…
Samit Dravid: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ ఆస్ట్రేలియాతో జరగబోయే అండర్-19 సిరీస్ లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 18 ఏళ్ల ఆల్ రౌండర్ వన్డే, 2 నాలుగు రోజుల మ్యాచ్ లు ఆడబోయే జట్లలో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఎంపిక దేశీయ స్థాయిలో సమిత్ అద్భుతమైన ప్రదర్శన తర్వాత వచ్చింది. దేశీయ స్థాయిలో అతను స్థిరంగా పరుగులు సాధించాడు. అండర్-19 ఈ సిరీస్ లో…