Gautam Gambhir: నేను ఏ ఆటగాడి భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేయను..
- సిడ్నీ టెస్టు ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన టీమిండియా హెడ్ కోచ్..
- విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ఫామ్ గురించి గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు..
- టీమిండియా జట్టు ప్రదర్శన మరింత మెరుగుపడాల్సి ఉంది: హెడ్ కోచ్ గంభీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir: సిడ్నీ టెస్టు ఓటమి తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేరుగా మీడియా సమావేశానికి వచ్చారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. జట్టులో సీనియర్ ఆటగాళ్లైన కోహ్లీ, రోహిత్‌పై కీలక కామెంట్స్ చేశాడు. కోహ్లీ, రోహిత్ ఫామ్ గురించి తనకు ఆందోళన అవసరం లేదు.. వారు పరుగులు చేయడానికి ఇంకా ఆకలితో ఉన్నారని తెలిపాడు. నేను ఏ ఆటగాడి భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేయడం లేదు.. అది వారి ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందన్నారు. వారిలో తపన, నిబద్ధత ఉంటే.. వారు భారత క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తారని గంభీర్ పేర్కొన్నాడు.
Read Also: Nara Lokesh: నా ఉద్యోగం తీయించేలా ఉన్నావే.. విద్యార్థితో లోకేశ్ ఛలోక్తి!
Also Read
- Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
- T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ 'గోట్'గా మనోడే!
నేను ప్రతి ఒక్కరితో నిజాయితీగా ఉంటాను.. అరంగేట్రం చేసిన ఆటగాడైనా.. 100 టెస్టులు ఆడిన ప్లేయరైనా ఒకేలా ఉంటాను అని కోచ్ గంభీర్ తెలిపారు. కేవలం జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం వల్లే సానుకూల ఫలితం రాలేదని నేను చెప్పను.. కానీ, గెలిచే అవకాశం ఉండే.. అయినా మాకు ఐదుగురు బౌలర్లతో కూడిన మంచి జట్టు ఉంది. ఏ ఒక్కరిపై తాము ఆధారపడం.. మేము ఇక్కడ కేవలం సిరీస్ ఓడిపోయాం అని టీమిండియా హెచ్ కోచ్ చెప్పాడు. మెల్‌బొర్న్ చివరి సెషన్‌లో సమష్టిగా పోరాడితే.. ఆసీస్‌పై ఒత్తిడి పెరుగుతుండే..ఈ మ్యాచ్‌లో కూడా గెలిచే అవకాశలు వచ్చాయి.. తొలి ఇన్నింగ్స్‌లో 181 కొట్టినా ఆధిక్యం దక్కింది.. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో 250 లేదా 300 టార్గెట్ ఇస్తే పక్కా విజయం సాధించే వాళ్లం.. బ్యాటింగ్, బౌలింగ్ లోపమని నేను తప్పుపట్టను.. మొత్తంగా మా జట్టు ఇంకా మెరుగుపడాల్సి ఉంది అని గౌతమ్ గంభీర్ వెల్లడించారు.
Read Also: Vishwambhara : యంగ్ హీరోకి పోటీగా రానున్న మెగాస్టార్ !
అయితే, మా జట్టులో చాలా మంది మా కుర్రాళ్లకు ఇది తొలి సిరీస్.. చాలా కఠిన పరీక్షను వారు ఎదుర్కొన్నారని భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపారు. మహ్మద్ సిరాజ్ అద్భుతమైన పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాడు.. బుమ్రా అద్భుతంగా ఆడాడు.. జైస్వాల్ పరుగులు కొట్టాడని చెప్పుకొచ్చాడు. ఇక, జట్టు భవిష్యత్తు గురించి మాట్లాడటం పద్దతి కాదు.. మరో టెస్టు సిరీస్‌కు ఐదు నెలల సమయం ఉందని అతడు పేర్కొన్నాడు. కాగా, సిడ్నీ టెస్టులో ఓటమితో బోర్డర్-గావస్కర్ ట్రోఫీని టీమిండియా 1-3 తేడాతో కోల్పోయింది. 162 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 27 ఓవర్లలోనే నాలుగు వికెట్లను కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా స్కాట్ బోలాండ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా జస్‌ప్రీత్ బుమ్రా అవార్డులను దక్కించుకున్నారు.
తాజావార్తలు
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!