Rishabh Pant: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి వరల్డ్ వైడ్ గా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటి వ్యక్తికి భారత జట్టులో ఆయనతో కలిసి ఆడినవారు మరింత గౌరవం ఇస్తారు. ధోనీ తమ మార్గదర్శి అని గర్వంగా చెప్పే క్రికెటర్లలో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ మొదటి స్థానంలో ఉంటాడు. ఇండియా టీమ్ కు రెండుసార్లు ప్రపంచ కప్‌ను అందించిన గొప్ప కెప్టెన్ గా ఎంఎస్ ధోనీ చిరస్థాయిగా నిలిచిపోతాడని ప్రశంసించారు. ధోనీని రీప్లేస్ చేయడం చాలా కష్టం.. ఆ దిశగా తాను ప్రయత్నిస్తున్నాను అని తెలిపాడు. ఇక, ధోనీ ఈ దేశానికి హీరో.. వ్యక్తిగతంగా, క్రికెటర్‌గా ఆయన నుంచి ఎన్నో అంశాలను నేర్చుకున్నాను.. మిస్టర్ కూల్ ఉన్నాడంటే.. జట్టులో ఎంతో నమ్మకం పెరుగుతుందని రిషభ్ పంత్ వెల్లడించారు.
Read Also: KTR: నంది నగర్లోని ఇంటికి కేటీఆర్.. కాసేపట్లో ఏసీబీ ఆఫీస్‌కు
ఇక, నాకేదైనా సమస్య ఉంటే.. ఎంఎస్ ధోనీతో పంచుకొంటా.. దానికి పరిష్కారం కూడా దొరుకుతుందని యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తెలిపాడు. వికెట్ కీపర్, ఆటగాడిగా ఓర్పు అత్యంత కీలకమని అతడు నాకిచ్చే సలహా.. ప్రశాంతంగా ఉంటూ 100 శాతం ప్రదర్శన ఇచ్చేందుకు ట్రై చేయాలని చెబుతుంటారు.. నేనెప్పుడూ ఎంఎస్డీతో నా రికార్డుల విషయాన్ని పోల్చుకోను.. కీపర్ గా క్యాచ్‌లను అందుకోవడం మ్యాచ్‌కు అత్యంత కీలకం.. దాని గురించి మరీ ఎక్కువగా ఆలోచించనని పంత్ పేర్కొన్నాడు.
Read Also: Justin Trudeau: కెనడాలో అంతర్గత తిరుగుబాటు.. రాజీనామా చేసే యోచనలో జస్టిన్ ట్రూడో..?
అయితే, మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు కెరీర్‌లో 90 మ్యాచ్‌లు ఆడగా.. మొత్తం 256 క్యాచ్‌లు, 38 స్టంపౌట్స్ చేశాడు. అలాగే, వన్డేల్లో 350 మ్యాచుల్లో 321 క్యాచ్‌లు, 123 స్టంపింగ్స్ ఉన్నాయి. ఇక, 98 టీ20లు ఆడిన ఎంఎస్ ధోనీ.. 57 క్యాచ్‌లు అందుకోగా, 34 స్టంపింగ్ అవుట్స్ చేశాడు. కాగా, రిషభ్ పంత్ విషయానికొస్తే.. 43 టెస్టుల్లో 149 క్యాచ్‌లు, 15 స్టంపింగ్స్ చేయగా..31 వన్డేల్లో 27 క్యాచ్‌లను అందుకుని ఒక్క స్టంపింగ్స్ మాత్రమే చేశాడు. ఇక, 76 టీ20ల్లో 38 క్యాచ్‌లు పట్టుకోగా, 11 స్టంపౌట్స్ పంత్ ఖాతాలో ఉన్నాయి.