పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్ ఆసియా కప్ 2024 రెండో మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో యూఏఈపై విజయం సాధించింది. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ తుఫాను బ్యాటింగ్, రసిక్ సలామ్ అద్భుత బౌలింగ్‌తో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 107 పరుగులకే ఆలౌటైన యూఏఈ.. అనంతరం లక్ష్య చేధనలో భారత్ 10.5 ఓవర్లలో 108 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించింది. భారత్ బ్యాటింగ్‌లో టీమ్ఇండియా ఓపెనర్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ.. క్రీజులోకి వచ్చిన…
న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమితో సిరీస్‌లో 1-0తో వెనుకంజలో నిలిచిన టీమిండియా.. పూణే టెస్టులో గెలవాలని చూస్తోంది. గురువారం నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. బెంగళూరు టెస్ట్ పరాజయం నేపథ్యంలో తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాదీ పేసర్, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి.…
ఇటీవల టెస్టుల్లో శ్రీలంక చేతిలో దారుణ ఓటములను ఎదుర్కొని భారత్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. బెంగళూరులో జరిగిన మొదటి టెస్టులో సంచలన ప్రదర్శనతో సొంతగడ్డపై వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియాకు షాక్ ఇచ్చింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ దిశగా దూసుకెళ్తున్న భారత జట్టుకు ఈ ఓటమి మింగుడుపడం లేదు. పూణే టెస్టులో గెలుపే లక్ష్యంగా రోహిత్ సేన బరిలోకి దిగనుంది. ఇందుకోసం జట్టులో మార్పులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో మార్పులు అనివార్యంగా…
వచ్చే నెలలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే.. ఈ పర్యటనలో టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ ఈ టూర్లో పాల్గొంటాడా లేదా అనేది అనుమానాలు ఉండేవి. అయితే.. వాటికి షమీ ఫుల్ స్టాప్ పెట్టాడు. తన ఫిట్‌నెస్‌పై షమీ స్వయంగా అప్డేట్ ఇచ్చాడు. తాను నొప్పి నుంచి పూర్తిగా విముక్తి పొందానని, ఆస్ట్రేలియా టెస్టు పర్యటనకు దూరం కానని చెప్పాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమి తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. కివీస్‌తో జరిగే రెండో, మూడో టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టును ప్రకటించింది. ఇందులో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం కల్పించింది.
Team India: టీమిండియా, న్యూజిలాండ్ మధ్య 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ప్రస్తుతం మొదటి మ్యాచ్ జరుగుతోంది. అక్టోబర్ 16 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభమైంది. నేడు (అక్టోబర్ 20) మ్యాచ్ ఐదో రోజు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయింది. కాగా, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసింది. దీంతో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఎదురుదాడి చేసి 462 పరుగులు చేసింది. దాంతో…
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరులో తొలి మ్యాచ్ జరుగుతోంది. సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ మధ్య 177 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో.. భారత జట్టు మొదటి టెస్ట్ నాలుగో రోజు మ్యాచ్‌పై పట్టు బిగించింది. అయితే న్యూజిలాండ్ బౌలర్లు 54 పరుగులకు ఏడు వికెట్లు తీసి అద్భుతంగా పునరాగమనం చేశారు.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా అద్భుతంగా రాణించింది. కాగా.. 462 పరుగులకు భారత్ ఆలౌటైంది. ఈరోజు 3 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ అద్భుతంగా ఆడారు. దీంతో.. భారత్ 107 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. సర్ఫరాజ్ ఖాన్ (150), పంత్ (99) పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ నిలకడగా ఆడి పరుగుల పట్టికను పరుగులు పెట్టించారు.
Team India Hit 100 Sixes in a Test Calendar Year: టెస్ట్ క్రికెట్లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. టెస్ట్ ఫార్మాట్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో 100 సిక్స్‌లు బాదిన మొదటి జట్టుగా భారత్ రెకార్డుల్లోకెక్కింది. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ ఈ ఫీట్ సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆజాజ్ పటేల్ బౌలింగ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సిక్సర్ బాదడంతో టీమిండియా 100 సిక్స్‌ల మైలురాయిని చేరుకుంది. 147…
బెంగళూరు వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఫలితం రావడం ఖాయంగా కనిపిస్తోంది. 356 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మూడోరోజు ఆట ముగిసేసరికి 231/3 స్కోరుతో నిలిచింది. రోహిత్ సేన ఇంకా 125 పరుగులు వెనుకబడి ఉంది. ఆట చివరి బంతికి విరాట్ కోహ్లీ (70) అవుట్ కాగా.. క్రీజ్‌లో సర్ఫరాజ్ ఖాన్ (70) ఉన్నాడు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్ బ్యాటింగ్…