IND vs AUS: టీమిండియా మరోసారి తక్కువ పరుగులకే అలౌటై క్రికెట్ అభిమానులను నివసిపరిచింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నేడు సిడ్నీ వేదికగా చివరి టెస్ట్ మొదలుకాగా.. మొదటి రోజే టీమిండియా 185 పరుగులకే మొదటి ఇన్నింగ్స్ లో కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా వరుస క్రమంలో టికెట్లు కోల్పోతూ తక్కువ స్కోరుకే పరిమితమైంది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ 40 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్స్ గా వచ్చిన యశస్వి జైస్వాల్ 10 పరుగులు, రాహుల్ నాలుగో పరుగులు చేసి పెరిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన శుభమన్ గిల్ కూడా కొద్దిసేపు నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేసినా 20 పరుగుల వద్ద లంచ్ విరామానికి ముందే పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత లంచ్ విరామం తర్వాత టీమిండియా టాప్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కూడా 17 పరుగులకే వెనుతిరిగాడు. ఇక ఆ తర్వాత రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఇన్నింగ్స్ ను నిలదొక్కే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా రిషబ్ పంత్ 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 26 వెనుతిరిగాడు.
Also Read: Renault Offer: బంపర్ ఆఫర్.. లక్ష కి.మీ.ల వారంటీ అంటున్న రెనాల్ట్
మరోవైపు నాలుగోవ టెస్టులో సెంచరీతో హీరోగా మారిన నితీష్ కుమార్ రెడ్డి ఈసారి గోల్డెన్ డక్ అవుట్ అయ్యి నిరాశపరిచాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ 14, ప్రసాద్ కృష్ణ 3, కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 22 పరుగులు చేసి అవుట్ అవ్వగా.. మహమ్మద్ సిరాజ్ మూడు పరుగులతో అజయంగా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ లో బోలాండ్ నాలుగు వికెట్లతో టీమిండియాను మరోసారి కట్టడి చేసారు. ఇక మిచెల్ స్టార్క్ కు 3, కమిన్స్ 2, నాథన్ లయన్ ఒక వికెట్ తీసుకున్నారు.