శిఖర్ ధావన్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుత బ్యాటింగ్‌తో అభిమానులను అలరించిన గబ్బర్.. మైదానంలో తన చిలిపి చేష్టలతో నవ్వులు పూయించేవాడు. ఇక కరోనా మహమ్మారి సమయంలో మాజీ సతీమణి, కుమారుడితో రీల్స్ చేసి అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. ఇటీవల కాస్త సైలెంట్ అయిన ధావన్.. మళ్లీ మొదలెట్టాడు. తాజాగా ఓ సరదా వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
శిఖర్ ధావన్ తాజాగా తన తండ్రి మహేంద్ర పాల్‌తో జరిగిన ఓ సరదా సన్నివేశాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. తండ్రి దగ్గరికి వెళ్లిన గబ్బర్.. ‘నాన్నా.. నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా’ అని అంటాడు. ‘నీకు తొలిసారి పెళ్లి చేసినప్పుడే హెల్మెట్ పెట్టి చేశాం’ అని మహేంద్ర కౌంటర్ ఇస్తారు. ఇక నీకెవ్వడు పిల్లను ఇస్తాడు అని మహేంద్ర అనకనే అంటాడు. దాంతో నిరాశపడిన గబ్బర్ పక్కనే ఉన్న సోఫాలో కూర్చుండిపోతాడు. ప్రస్తుతం ఈ రీల్ నెట్టింట వైరల్ అవుతోంది. ధావన్ రీల్ చూసి సోషల్ మీడియా యూజర్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. అందాల రాక్షసి సీన్ గుర్తు చేశావంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Team India: డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. వైరల్‌గా హర్భజన్ పోస్ట్!
ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఆయేషా ముఖర్జీని శిఖర్ ధావన్ 2012లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆయేషాకు అప్పటికే మొదటి భర్త నుంచి విడాకులు అయి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ధావన్, ఆయేషాకు కుమారుడు జోరావర్ ఉన్నాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2020 నుంచి దూరంగా ఉన్నారు. తాను విడిపోతున్నట్లు 2021లో ఆయేషా ఇన్‌స్టాలో ప్రకటించింది. తన భార్య మానసికంగా వేధిస్తోందని ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో గబ్బర్ కేసు వేశారు. 2023లో ధావన్, అయేషాకు విడాకులు మంజూరు అయ్యాయి. కెరీర్‌లో 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 6793, టెస్టుల్లో 2315, టీ20ల్లో 1759 పరుగులు చేశాడు. వన్డేల్లో 17, టెస్టుల్లో 7 సెంచరీలు గబ్బర్ ఖాతాలో ఉన్నాయి.