Rohit Sharma: రోహిత్ శర్మపై వేటు.. మూడు వికెట్స్ కోల్పోయిన భారత్!
- రోహిత్ శర్మపై వేటు
- జట్టులోకి శుభ్‌మన్ గిల్, ప్రసిద్ధ్ కృష్ణ
- 3 వికెట్స్ కోల్పోయిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందరూ అనుకున్నదే నిజమైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదవ టెస్టులో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు స్థానం దక్కలేదు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న రోహిత్‌కు మేనేజ్‌మెంట్ విశ్రాంతిని ఇచ్చింది. దాంతో ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐదవ టెస్టులో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగినట్లు బుమ్రా చెప్పాడు. శుభ్‌మన్ గిల్, ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చారు. రోహిత్ స్థానంలో గిల్, ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ ఆడుతున్నారు.
సిడ్నీ టెస్టులో లంచ్ బ్రేక్ ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (20) లంచ్ బ్రేక్‌కు ముందు ఔటయ్యాడు. లంచ్ బ్రేక్‌కు ముందు చివరి బంతికి గిల్ లయ తప్పాడు. అప్పటి వరకు నిలకడగా ఆడిన గిల్ (20) నాథన్ లైయన్ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (4), యశస్వి జైస్వాల్ (10) విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ (12) నెమ్మదిగా ఆడుతున్నాడు. రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చినా జట్టు ప్రదర్శనలో పెద్దగా మార్పు లేదు.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
తుది జట్లు:
భారత్: యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, నితీశ్ కుమార్‌రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఆస్ట్రేలియా: సామ్ కొన్‌స్టాస్, ఉస్మాన్ ఖవాజా, లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, వెబ్‌స్టర్, అలెక్స్ గ్యారీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, స్కాట్ బొలాండ్.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..