టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కెరీర్ ఆరంభంలో ఆడిన రెండు ఇన్నింగ్స్‌లను ఎవరూ మర్చిపోరు. పాకిస్తాన్‌పై 148 రన్స్, శ్రీలంకపై 183 రన్స్ బాదాడు. ముఖ్యంగా రాజస్థాన్‌లోని జైపుర్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఆడిన 183 భారీ ఇన్నింగ్స్ అందరికీ గుర్తుంటుంది. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడి వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 145 బంతుల్లో 183 పరుగులతో మహీ నెలకొల్పిన రికార్డును గత 19 ఏళ్లుగా…
తాను చాలా ప్రాక్టికల్ అని, జరిగిన ప్రతి సంఘటన గురించి బాధపడితే ఉపయోగం లేదని టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అన్నాడు. తాను హార్దిక్ పాండ్యాతో చాలా సమయం గడిపానని, కష్టకాలంలో తనకు అండగా నిలిచాడన్నాడు. మ్యాచులో త్వరగా ఔటైతే దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదన్నాడు. తనకు మరలా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలనే కోరిక ఉందని ఇషాన్ చెప్పాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాలో పర్యటించే భారత్-ఏ జట్టుకు ఎంపికైన ఇషాన్.. సత్తా చాటి తిరిగి…
సొంతగడ్డపై ఎదురులేని భారత్.. న్యూజిలాండ్‌తో మూడు టెస్టు సిరీస్‌ను సునాయాసంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. టీమిండియాకు ప్రధాన అస్రం అయిన స్పిన్ ఉచ్చులోనే పడి భారత బ్యాటర్లు తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. కివీస్ రెండు టెస్టుల్లోనూ విజయం సాధించి.. భారత గడ్డపై మొదటిసారి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. నవంబర్ 1 నుంచి ముంబై వేదికగా జరిగే మూడో టెస్టులో అయినా గెలిచి పరువు కాపాడుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలోనే పిచ్ విషయంలో టీమిండియా కఠిన నిర్ణయం…
ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కలేదు. దాంతో సోషల్ మీడియాలో బీసీసీఐ సెలక్షన్ కమిటీపై ట్రోల్స్ వచ్చాయి. రుతురాజ్ యెల్లో జెర్సీ (చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ) వేసుకోవడం వల్లే ఎంపిక చేయలేదని కామెంట్లు చేశారు. రుతురాజ్‌ను సెలక్ట్ చేయకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా-ఏతో మ్యాచ్‌లకు జట్టును నడిపించే రుతురాజ్.. ప్రధాన టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోవడం ఆశ్చర్యంగా…
న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య నవంబర్ 8 నుంచి 15 వరకు 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ టీ20 సిరీస్ కోసం ఇటీవలే బీసీసీఐ జట్టును ప్రకటించింది. భారత జట్టు కోచింగ్ బాధ్యతలను భారత మాజీ క్రికెటర్, ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ అందుకోనున్నాడని తెలిసింది. లక్ష్మణ్ గతంలో కూడా తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.…
టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేసినట్లు సమాచారం. అయితే.. న్యూజిలాండ్‌తో జరిగే మూడో టెస్టుకు మాత్రమేనా, లేదా పూర్తిగా రద్దు చేశాడా అనేది క్లారిటీ లేదు.
టామ్ లాథమ్ సారథ్యంలోని న్యూజిలాండ్ జట్టు భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. పుణెలో శనివారం జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. భారత గడ్డపై తొలిసారిగా న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.
IND vs NZ: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ చాలా రసవత్తంగా కొనసాగుతుంది. ఈ మ్యాచ్ లో రెండో ఇన్సింగ్స్ లో కివీస్ ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో 259 రన్స్ చేసిన న్యూజిలాండ్.. రెండు ఇన్నింగ్స్ లో 255 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా విజయానికి 359 పరుగులు చేయాల్సి ఉంది.
WTC Team India: బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ మిర్పూర్లోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో ఆతిథ్య బంగ్లాదేశ్‌ను ఓడించింది. దింతో ఆఫ్రికన్ జట్టు 10 ఏళ్ల తర్వాత ఆసియా ఖండంలో దక్షిణాఫ్రికా టెస్టు విజయాన్ని అందుకుంది. అంతకుముందు 2014లో గాలెలో శ్రీలంకపై ఆసియా ఖండంలో దక్షిణాఫ్రికా చివరి టెస్టు విజయం సాధించింది. ఇక మీర్పూర్ టెస్టులో చిరస్మరణీయ విజయంతో, దక్షిణాఫ్రికా ప్రపంచ…