భారత్ ఇంగ్లాండ్ మధ్య సెకండ్ టీ20 హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్ లో 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఇంగ్లాండ్ పై ఘనవిజయం సాధించింది. 19.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి సూపర్ విక్టరీ కొట్టింది. ఈ గెలుపుతో భారత్ ఐదు టీ20ల సిరీస్ లో 2-0 లీడ్ లో ఉంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ స్కోర్ కు అడ్డుకట్టపడింది.
ఇక 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా చేధనలో తడబడింది. 10 ఓవర్లకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సంజు శాంసన్ 5 పరుగులు, అభిషేక్ శర్మ 12 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 12, దృవ్ జురెల్ 4, హార్థిక్ పాండ్య 7, అక్షర్ పటేల్ 2, వాషింగ్ టన్ సుందర్ 26, అర్షదీప్ సింగ్ 6 పరుగులతో నిరాశ పరిచారు. భారత్ యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ విజృంభించి ఆడడంతో భారత్ స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ ఫూర్తి చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
తిలక్ వర్మ 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో విరుచుకుపడి 72 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రవిబిష్ణోయ్ కీలక పరుగులు రాబట్టి జట్టు విజయంలో కీలకంగా మారాడు. ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ జోస్ బట్లర్ అత్యధిక స్కోరు 30 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. జామీ స్మిత్ 22 పరుగులు చేయగా, బ్రేడన్ కార్సే 31 పరుగులు చేశారు. భారత్ తరపున అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో 2 వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మలు తలో వికెట్ తీశారు.