Aakash Chopra: “ఇదే బెస్ట్ ఛాన్స్”.. కెప్టెన్ సూర్య రిటైర్మెంట్ వార్తలు మధ్య ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aakash Chopra: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరు ఫైనల్‌కు ముందు ఒక్కసారిగా మార్మోగుతోంది. ఈ ఫైనల్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు వైరల్‌గా మారాయి. ఈ అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే.. ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా సూర్య నిలిచాడు. ఈ అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ ఎనిమిది మ్యాచ్‌ల్లో 242 పరుగులు సాధించాడు. గ్రూప్ దశలో యూఎస్‌ఏపై 84 పరుగులు చేశాడు. అయితే.. ఫైనల్ మ్యాచ్, రిటైర్మెంట్ వార్తల మధ్య భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఈ టీ20 వరల్డ్ కప్‌లో సూర్య పెద్ద జట్లపై బిగ్ స్కోర్ చేయలేకపోయాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని ఆకాశ్ చోప్రా కూడా ప్రస్తావించాడు. సూర్యకుమార్‌పై విమర్శలు కొంతవరకు అన్యాయమేనన్న చోప్రా.. మరోవైపు పెద్ద జట్లపై సూర్య నుంచి పెద్ద ఇన్నింగ్స్ రావాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డాడు. ఇదే బెస్ట్ ఛాన్స్ అంటూ సూచించాడు.
READ MORE: Women’s Day 2026:జగతికి జీవం పోసిన జోలాపాటకు.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
Also Read
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
- Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
ప్రపంచంలోని అగ్ర జట్లపై ఇప్పటివరకు రెండు అర్ధశతకాలు మాత్రమే చేశాడని గుర్తు చేశాడు. చోప్రా మరో ఆసక్తికర విషయాన్ని గుర్తు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టి20 కెరీర్ ప్రారంభమైన మైదానం ఇదేనని తెలిపాడు. 2021లో భారత జట్టుకు తొలి టీ20 మ్యాచ్ ఆడింది ఇక్కడే అన్నాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి బంతినే సిక్సర్‌గా బాదుతూ తన కెరీర్‌ను ఘనంగా ప్రారంభించినట్లు గుర్తు చేశాడు. అందుకే ఈ ఫైనల్ మ్యాచ్ సూర్యకుమార్ జీవితంలో ఒక ప్రత్యేకమైన సందర్భం కావొచ్చని చోప్రా అభిప్రాయపడ్డాడు. తన కెరీర్ ప్రారంభమైన మైదానంలోనే ప్రపంచకప్ ఫైనల్ ఆడుతూ మ్యాచ్ గెలిపించే ఇన్నింగ్స్ ఆడితే తన ప్రయాణం అద్భుతంగా మారుతుందన్నాడు.
READ MORE: Sai Durgha Tej :మహిళల కోసం సాయి దుర్గ తేజ్ కొత్త పోరాటం.. ‘స్టాండ్ విత్ హర్’ అంటూ ముందడుగు..
ఇక గత ఏడాది సూర్యకుమార్ యాదవ్ అంతగా ఫామ్‌లో లేడు. టీ20 మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధశతకం సైతం నమోదు చేయలేకపోయాడు. కానీ ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌పై జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో మంచి ఫామ్ తిరిగి సంపాదించాడు. అదే జోష్‌ను ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్‌లోనూ కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు.. ఈ టోర్నీలో అమెరికాపై చేసిన 84 పరుగుల తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కొంత తగ్గినట్టు కనిపించినా, భారత జట్టుకు పెద్దగా ఇబ్బంది కలగలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా సంజూ శామ్సన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం వల్ల జట్టు స్థిరంగా ముందుకు సాగిందని అంటున్నారు. అయినప్పటికీ ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో కెప్టెన్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?