Jasprit Bumrah: దిగ్గజాలను వెనక్కినెట్టి.. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా బుమ్రా అరుదైన రికార్డ్
- ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా బుమ్రా
- భారత తొలి పేసర్ గా రికార్డ్
- ట్రావిస్ హెడ్, జో రూట్, హ్యారీ బ్రూక్ లాంటి దిగ్గజ క్రికెటర్లను వెనక్కి నెట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ హిస్టరీలో జస్ప్రీత్ బుమ్రా సరికొత్త అధ్యాయానికి తెరలేపాడు. రేర్ ఫీట్లను అందుకుంటూ చరిత్ర సృష్టిస్తున్నాడు. ఫాస్ట్ బౌలర్ గా టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి జట్ల ఆటకట్టిస్తూ టీమిండియాను విజయతీరాలకు చేర్చడంలో బుమ్రా దిట్ట. కాగా ఇటీవల బుమ్రా ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మరోసారి బుమ్రాను ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపిక చేసింది.
ప్రతిష్టాత్మకమైన సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫికి బుమ్రా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని మంగళవారం (జనవరి 28) ఐసీసీ ప్రకటించింది. ట్రావిస్ హెడ్, జో రూట్, హ్యారీ బ్రూక్ లాంటి దిగ్గజ క్రికెటర్లను వెనక్కి నెట్టి బుమ్రా ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో ఈ సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డును రాహుల్ ద్రవిడ్ (2004), సచిన్ టెండూల్కర్ (2010), అశ్విన్ (2016), విరాట్ కోహ్లి (2017, 2018) గెలుచుకున్నారు.
Also Read
- ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
- Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
- ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
- India vs Pakistan: "అసలు మజా అప్పుడే".. దాయాదుల మధ్య పసిడి పోరు..
గతేడాది క్రికెట్ లో అత్యుత్తమ ప్రతిభకనబర్చినందుకుగాను బుమ్రాకు ఈ అవార్డులు దక్కాయి. కాగా గతేడాది బుమ్రా టెస్టుల్లో అద్భుతమైన పర్పామెన్స్ ఇచ్చాడు. 13 టెస్టు మ్యాచుల్లో బౌలింగ్ చేసి ఏకంగా 71 వికెట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారత పేసర్ గా బుమ్రా హిస్టరీ క్రియేట్ చేశాడు. బుమ్రాపై క్రికెట్ లవర్స్ తో పాటు సహచర ఆటగాళ్లు అభినందనలు తెలుపుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
An unforgettable year for the irrepressible Jasprit Bumrah, who claims the Sir Garfield Sobers Trophy for 2024 ICC Men’s Cricketer of the Year 🙌 pic.twitter.com/zxfRwuJeRy
— ICC (@ICC) January 28, 2025
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?