U-19 World Cup 2025: ఇంగ్లాండ్‌పై గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత మహిళల జట్టు..
- అండర్-19 మహిళల ప్రపంచకప్ లో ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు
- ఇంగ్లాండ్‌పై గెలిచి ఫైనల్‌కు వెళ్లిన భారత మహిళల జట్టు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అండర్-19 మహిళల ప్రపంచకప్ 2025లో భారత మహిళల జట్టు ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. కౌలాలంపూర్‌లోని బయుమాస్ ఓవల్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలిచింది. 114 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 30 బంతులు ఉండగానే విజయం సాధించింది. దీంతో.. ఇంగ్లాండ్ పై గెలిచి ఫైనల్ లోకి అడుగుపెట్టింది భారత మహిళల జట్టు. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ కెప్టెన్ అబీ నారోగ్రోవ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
Read Also: Shahid Kapoor : కబీర్ సింగ్ కలెక్షన్లను ‘దేవా’ కొల్లగొడతాడా..?
Also Read
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో డేవినా పెర్రిన్ (45), కెప్టెన్ అబీ నారోగ్రోవ్ (30), అము సురేన్‌కుమార్ (14) పరుగులు మినహా మిగత బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. దీంతో.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. భారత్ బౌలింగ్‌లో పారుణికా సిసోడియా, వైష్ణవి శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశారు. చెరో 3 వికెట్లతో చెలరేగారు. వీరికి తోడు అయూషి శుక్లా 2 వికెట్లు సాధించింది. దీంతో.. ఇంగ్లాండ్ బ్యాటర్లు పరుగులు చేయకుండా పెవిలియన్‌కు పంపించారు.
Read Also: Rashmika: స్టేజ్ మీద రష్మిక లైవ్ పెర్ఫార్మెన్స్
అనంతరం 114 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు ఓపెనర్లు కమలిని (56*), తెలుగమ్మాయి గొంగడి త్రిష (35) మంచి ఆరంభాన్ని అందించారు. బ్రెట్ బౌలింగ్‌లో గొంగడి త్రిష ఔట్ కాగా.. సానికా చల్కే (11) పరుగులు చేసింది. దీంతో.. ఒక వికెట్ నష్టానికి భారత మహిళల జట్టు విజయం సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రపంచకప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. గ్రూప్ దశలో వెస్టిండీస్, మలేసియాలను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. శ్రీలంకను 60 పరుగుల తేడాతో ఓడించింది. సూపర్ సిక్స్‌లో బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో, స్కాట్లాండ్‌పై 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తాజావార్తలు
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?