Varun Chakravarthy: చక్రవర్తి ఖాతాలో చెత్త రికార్డు.. ప్రపంచ క్రికెట్‌లో ఇదే తొలిసారి!
- అదరగొడుతున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి
- మూడో టీ20లో ఐదు వికెట్లు
- చక్రవర్తి ఖాతాలో చెత్త రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అదరగొడుతున్నాడు. కోల్‌కతాలో జరిగిన తొలి టీ20లో 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టిన చక్రవర్తి.. చెన్నైలో జరిగిన రెండో టీ20లో రెండు వికెట్లు తీశాడు. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో ఐదు వికెట్లతో చెలరేగాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 24 పరుగులే ఇచ్చి ఇంగ్లీష్ జట్టు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకట్ట వేశాడు. అందరి ప్రశంసలు అందుకుంటున్న చక్రవర్తి ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది.
టీ20లో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది రెండోసారి. 2024లో దక్షిణాఫ్రికాపై రెండో టీ20లో ఐదు వికెట్లు పడగొట్టాడు. నాలుగు ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి.. ఐదు వికెట్లు తీశాడు. తాజాగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో మరోసారి ఐదు వికెట్లు (5/24) సాధించాడు. అయితే ఈ రెండు మ్యాచ్‌లలో టీమిండియా ఓడిపోయింది. అంతర్జాతీయ టీ20ల్లో ఓ బౌలర్ ఐదు వికెట్లు ప్రదర్శన చేసిన రెండు సందర్భాల్లోనూ జట్టు ఓడిపోవడం ప్రపంచ క్రికెట్‌లో ఇదే తొలిసారి. దాంతో చక్రవర్తి ఖాతాలో చెత్త రికార్డు చేరింది.
Also Read
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
Also Read: Steve Smith: అరుదైన మైలురాయికి అందుకున్న స్టీవ్ స్మిత్.. రికార్డులే రికార్డులు!
వరుణ్ చక్రవర్తి ఓ రికార్డు కూడా నెలకొల్పాడు. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లలో 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. రాజ్‌కోట్ టీ20లో ఐదు వికెట్ల ఘనతను అందుకోవడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలోని 4 టీ20ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 2016లో శ్రీలంకపై యాష్ 9 వికెట్లు తీయగా.. 2023లో ఐర్లాండ్‌పై బిష్ణోయ్ 9 వికెట్లు తీశాడు. చక్రవర్తి భారత్ తరఫున 16 టీ20లు ఆడి 29 వికెట్స్ పడగొట్టాడు.
తాజావార్తలు
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!