కటక్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. 305 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. భారత్ ఇంకా 33 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.
India vs England: కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరగనున్న భారత్, ఇంగ్లాండ్ రెండో వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ గెలిచింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం. సిరీస్ గెలవాలనే ఉద్దేశ్యంతో టీం ఇండియా ఈ మ్యాచ్‌లోకి దిగుతుండగా.. ఇంగ్లాండ్ జట్టు సిరీస్‌ను డ్రా చేసుకోవడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది. దీనితో…
India vs England: భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరగనుంది. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌ను 4 వికెట్ల తేడాతో గెలుచుకున్న తర్వాత, టీమిండియా ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. దీనితో కటక్‌లో జరిగే రెండో వన్డే మ్యాచ్ గెలిస్తే భారత్ సిరీస్‌ను గెలుచుకుంటుంది. ఇంగ్లాండ్‌తో జరిగే ఈ వన్డే మ్యాచ్‌లో…
హిట్ మ్యాన్‌గా పేరొందిన రోహిత్ శర్మకు ఏమైంది.. 2024 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలిచినప్పటి నుండి అతను సరిగా ఆడటం లేదు.. దీంతో.. తన బ్యాట్‌కు ఏదో ఒక శాపం తగిలి ఉంటుందని క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తీవ్ర నిరాశ పరిచిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత రంజీలో ఆడాడు. అక్కడ కూడా ఇదే రకమైన ప్రదర్శన కనబరిచాడు.
ఇంగ్లాండ్-భారత్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరుగుతోంది. విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో రవీంద్ర జడేజా రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు.
IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నేటి నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక టీమిండియా నుండి హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్ భారత్ తరఫున అరంగేట్రం చేయబోతున్నారు. గాయం కారణంగా విరాట్ కోహ్లీ ఆడటం లేదు. 2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇరు జట్ల మధ్య ఇదే చివరి వన్డే సిరీస్. దీనిని ఛాంపియన్స్…
భారత మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్, టీ20 ప్రపంచ కప్ 2024 విజేత జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. రాహుల్ ద్రవిడ్ ప్రయాణిస్తు్న్న కారును ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం తెలియగానే ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే ఈ ప్రమాదంలో రాహుల్ ద్రవిడ్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఈ ప్రమాదం అనంతరం ద్రవిడ్ ఆటో…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నుంచి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను తొలగించారు. మంగళవారం భారత వన్డే జట్టు ప్రకటించినప్పుడు బుమ్రా పేరు జట్టులో లేదు.
ఇటీవల భారత్ vs ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో గెలుచుకుంది. కాగా.. ఆల్ రౌండర్ శివం దూబే నాల్గవ, ఐదవ టీ20 మ్యాచ్‌లలో అద్భుతంగా రాణించాడు.
ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ గురువారం (ఫిబ్రవరి 6) నుండి ప్రారంభమవుతుంది. చాలా రోజుల తర్వాత జట్టులోకి అడుగుపెట్టిన మహమ్మద్ షమీకి కూడా వన్డే సిరీస్‌లో అవకాశం లభించింది. కాగా.. మొదటి వన్డే నాగ్‌పూర్‌లో జరుగనుంది.. ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీ ప్రపంచ రికార్డు సృష్టించే అవకాశం ఉంది.