ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ గురువారం (ఫిబ్రవరి 6) నుండి ప్రారంభమవుతుంది. చాలా రోజుల తర్వాత జట్టులోకి అడుగుపెట్టిన మహమ్మద్ షమీకి కూడా వన్డే సిరీస్‌లో అవకాశం లభించింది. కాగా.. మొదటి వన్డే నాగ్‌పూర్‌లో జరుగనుంది.. ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీ ప్రపంచ రికార్డు సృష్టించే అవకాశం ఉంది.
ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు.. సిక్సులతోనే డీల్ చేశాడు.
ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లలో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. 4-1 ఆధిక్యంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించాడు. అయితే ఈ సిరీస్‌లో సూర్య కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. ఇది సూర్య కెరీర్లో చెత్త రికార్డు.
భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఐదో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 150 పరుగుల తేడాతో గెలిచి ఇంగ్లీష్ జట్టును మట్టికరింపించింది. ఐదు టీ20 మ్యాచ్ ల సరీస్ లో 4-1 అధిక్యంతో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ అసలు సిసలైన హీరో ఎవరంటే అభిషేక్ శర్మ అని చెప్పాలి. తన విధ్వంసకర బ్యాటింగ్ తో ఇంగ్లండ్ జట్టు ఆటకట్టించాడు. మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద…
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ లో నేడు ఆఖరి మ్యాచ్ జరుగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదకగా ఇరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఇంగ్లీష్ జట్టుకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ మ్యాచ్ లో యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. తన మెరుపు బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. టీ20ల్లో కొత్త…
ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా కాసేపట్లో చివరి టీ20 మ్యాచ్ జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో.. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో.. ముందుగా టీమిండియా బ్యాటింగ్ చేయనుంది.
ఈరోజు ఇంగ్లాండ్ తో జరిగే ఐదో టీ20 మ్యాచ్‌కు సంజు శాంసన్ ను పక్కన పెట్టనున్నారు. సంజుకు మరిన్నీ అవకాశాలు ఇవ్వాలని తెలిపిన సంజయ్ మంజ్రేకర్. అతడు ఫాంలోకి వస్తే టీమిండియాకు తిరుగులేదని వెల్లడించారు.
అండర్-19 మహిళల ప్రపంచకప్ 2025లో భారత మహిళల జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. కౌలాలంపూర్‌లోని బయుమాస్ ఓవల్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలిచింది. 114 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 30 బంతులు ఉండగానే విజయం సాధించింది. దీంతో.. ఇంగ్లాండ్ పై గెలిచి ఫైనల్ లోకి అడుగుపెట్టింది భారత మహిళల జట్టు.
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అదరగొడుతున్నాడు. కోల్‌కతాలో జరిగిన తొలి టీ20లో 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టిన చక్రవర్తి.. చెన్నైలో జరిగిన రెండో టీ20లో రెండు వికెట్లు తీశాడు. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో ఐదు వికెట్లతో చెలరేగాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 24 పరుగులే ఇచ్చి ఇంగ్లీష్ జట్టు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకట్ట వేశాడు. అందరి ప్రశంసలు అందుకుంటున్న చక్రవర్తి ఖాతాలో ఓ చెత్త…
అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025లో తెలంగాణ అమ్మాయి గొంగిడి త్రిష అదరగొడుతున్న విషయం తెలిసిందే. టోర్నీలో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన త్రిష 230 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌పై (40), శ్రీలంకపై (49)పై కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన తెలుగమ్మాయి.. స్కాట్లాండ్పై సెంచరీ (110) చేసింది. 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సులతో శతకం బాదింది. దాంతో అండర్-19 మహిళల ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి మహిళగా త్రిష రికార్డు సృష్టించింది. ఈ రికార్డుపై మాజీ మంత్రి,…