మంగళవారం రాత్రి ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ ఓడిపోవడం తనను చాలా బాధించిందని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తెలిపాడు. మ్యాచ్‌ను తాము అనుకున్నవిధంగా ముగించలేకపోయామన్నాడు. ఫలితం గురించి ఆలోచించడం పక్కన పెట్టి తర్వాత మ్యాచ్ కోసం సిద్ధమవుతా అని చెప్పాడు. ఈ మ్యాచులో బౌలింగ్ వేసి ఉండొచ్చు కానీ.. మున్ముందు ఇంకా మెరుగ్గా వేయాల్సిన అవసరం ఉందని చక్రవర్తి చెప్పుకొచ్చాడు. మూడో టీ20లో చక్రవర్తి (5/24) అద్భుత ప్రదర్శన చేశాడు. చక్రవర్తి ఐదు…
క్రికెట్ హిస్టరీలో జస్ప్రీత్ బుమ్రా సరికొత్త అధ్యాయానికి తెరలేపాడు. రేర్ ఫీట్లను అందుకుంటూ చరిత్ర సృష్టిస్తున్నాడు. ఫాస్ట్ బౌలర్ గా టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి జట్ల ఆటకట్టిస్తూ టీమిండియాను విజయతీరాలకు చేర్చడంలో బుమ్రా దిట్ట. కాగా ఇటీవల బుమ్రా ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మరోసారి బుమ్రాను ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్…
Ind vs Eng 3rd T20: టీమిండియా కుర్రాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే ఐదు టీ20 సిరీస్‌లో 2-0తో భారత జట్టు ముందంజలో ఉంది. ఈరోజు జనవరి 28) రాజ్‌కోట్ వేదికగా బట్లర్ సేనతో జరుగబోయే మూడో టీ20లో గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.
Rohit Sharma: ప్రస్తుతం ఫామ్ కోసం తెగ కష్టపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ పదిహేనేళ్ల అభిమాని రాసిన భావోద్వేగభరితమైన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లేఖ క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టెస్టు, వన్డేల్లో టీమిండియా సారథిగా ఉన్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఇటీవల జరిగిన బోర్డర్-గావస్కర్ టోర్నీలో టీమిండియా ప్రదర్శన నిరాశజనకంగా ఉండటంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రోహిత్ శర్మ ఆటతీరు తగ్గిందని, క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.…
టీమిండియా పేసర్, హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సింగర్ జనై భోస్లేతో డేటింగ్ చేస్తున్నట్లు నెట్టింట వార్తలొచ్చాయి. ఇటీవల ముంబైలోని బాంద్రాలో జనై 23వ పుట్టినరోజు వేడుకలు జరగగా.. సిరాజ్ హాజరయ్యాడు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను బాలీవుడ్ సింగర్ తన ఇన్‌స్టాలో పోస్టు చేయగా.. ఓ ఫొటోలో ఇద్దరూ (జనై, సిరాజ్) కాస్త సన్నిహితంగా ఉన్నట్లు ఉంది. దాంతో వీరిద్దరూ డేటింగ్లో…
భారత్ ఇంగ్లాండ్ మధ్య సెకండ్ టీ20 హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్ లో 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఇంగ్లాండ్ పై ఘనవిజయం సాధించింది. 19.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి సూపర్ విక్టరీ కొట్టింది. ఈ గెలుపుతో భారత్ ఐదు టీ20ల సిరీస్ లో 2-0 లీడ్ లో ఉంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో…
భారత్ -ఇంగ్లండ్ జట్ల మధ్య సెకండ్ టీ20 మ్యాచ్ జరుగుతోంది. చిదంబరం స్టేడియం వేదికగా గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు తలపడుతున్నాయి. కాగా ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుని ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టపోయి 165 పరుగులు చేసింది. భారత్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి…
భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ టీ20లో భారత్ బోణీ కొట్టింది. నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. విజయం కోసం ఇరు జట్లు పోటీపడనున్నాయి. కాసేపట్లో చిదంబరం స్టేడియం వేదికగా రెండో టీ20 జరుగనున్నది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది భారత్…
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) శనివారం 2024 పురుషుల టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్‌ని ప్రకటించింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. రోహిత్ సారథ్యంలో భారత్ గతేడాది టీ20 ప్రపంచకప్ 2024 గెలుచుకుంది. 2024 సంవత్సరంలో అత్యుత్తమ టీ20 జట్టుగా భారత్ ఆధిపత్యం చెలాయించింది. ఈ జట్టులో నలుగురు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది.
Maha Kumbh Mela 2025: ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ తో టి20 సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కోల్‌కతాలో జరిగిన మొదటి మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయం సాధించగా.. నేడు చెన్నై వేదికగా రెండో టి20 మ్యాచ్ జరుగునుంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా సోషల్ మీడియాలో టీమిండియాకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టించిన ఈ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. Also Read: IND…