ICC ODI Rankings: ఒకవైపు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లోకి టీమిండియా అడుగు పెట్టగా.. మరోవైపు ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. ముఖ్యంగా టాప్ 10 బ్యాట్స్మెన్లలో నాలుగు స్థానాలను భారత ఆటగాళ్లు ఉండడం విశేషమే. ఈ ర్యాంకింగ్స్ లో శుభ్‌మన్ గిల్ నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోగా.. విరాట్ కోహ్లీ ఒక స్థానం ఎగబాకి నాల్గవ స్థానానికి చేరుకున్నారు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం రెండు స్థానాలు దిగజారి…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీ ఫైనల్లో భారత్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు స్మిత్ తన నిర్ణయం ప్రకటించాడు. అయితే, 170 వన్డేల్లో 5,800 పరుగులు చేసిన స్మిత్.. 12 సెంచరీలు.. 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, వన్డేల్లో ఆసీస్ కెప్టెన్ స్మిత్ అత్యధిక స్కోర్ 164 పరుగులు.
IND vs AUS: ఉత్కంఠ ఫలితంగా సాగిన భారత్ – ఆస్ట్రేలియా సెమి ఫైనల్ మ్యాచ్‌లో టీం ఇండియా ఘనవిజయం సాధించింది. చివరి వరకు నువ్వా.. నేనా.. అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో చివరకు టీమిండియా ఆధిపత్యం కొనసాగించింది. దీంతో టీం ఇండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫైనల్లో అడుగు పెట్టింది. ఇక మ్యాచ్ భారీ లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ మరోమారు తనదైన శైలి బ్యాటింగ్ తో 84 పరుగులు చేసి టీమిండియా విజయానికి బాటలు…
AUS vs IND: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (73: 96 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), అలెక్స్ క్యారీ (61; 57 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అర్థ శతకాలతో రాణించగా 49.3 ఓవర్లలో 264 రన్స్ కు ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది.
IND vs AUS: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్ కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీసుకుంది. భారత్ వరుసగా 14వ సారి టాస్‌ను కోల్పోయింది.
IND vs AUS: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మొదటి సెమీఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య మార్చి 4న జరగనుంది. ఐసీసీ టోర్నమెంట్ లలో ఇరు జట్లకు సెమీఫైనల్లో మూడోసారి తాడోపేడో తేల్చుకోనున్నారు. క్రితం రెండు సార్లు ఐసీసీ టోర్నమెంట్ సెమీఫైనల్లో ఇరు జట్లు ఎప్పుడు తలపడ్డాయి? అందులో ఎవరు గెలిచారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటూనే.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మొదటి సెమీఫైనల్లో గెలుపు ఎవరిది అనేది చూద్దాం. Read Also: IOB Recruitment…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా తదుపరి మ్యాచ్ మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరాయి. కాగా.. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడకపోవచ్చు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మకు ఈ మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వవచ్చని సమాచారం.
రోహిత్ శర్మ కెప్టెన్సీ శైలిపై టీమిండియా స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ ప్రశంసలు కురిపించారు. గత కొన్ని సంవత్సరాలుగా రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంతో ఎదిగాడని అన్నారు. రోహిత్ తన సహచరులతో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం టీమిండియాకు మంచి విషయం అని శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం వన్డే ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తాజా ర్యాంకింగ్స్‌లో ఒక్కొక్క స్థానం మెరుగుపరచుకున్నారు. కోహ్లీ మళ్ళీ టాప్-5లోకి చేరాడు. 743 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉన్నాడు.
Champions Trophy 2025: 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ఇండియా విజయంతో శుభారంభం చేసింది. గురువారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే, ఈ విజయంతో అందరూ సంతోషంగా ఉన్న.. అక్షర్ పటేల్‌కు మాత్రం కొంత అసంతృప్తి మిగిలింది. హ్యాట్రిక్‌కు ఒక్క వికెట్ దూరంలో ఉన్న అతడు, కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ వదిలేయడం కారణంగా గొప్ప అవకాశాన్ని కోల్పోయాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో అక్షర్ 9వ ఓవర్లో వరుసగా రెండు వికెట్లు తీసి…