Ravi Shastri: ఆల్‌టైమ్ గ్రేట్ టాప్-5 ఇండియా క్రికెటర్లు.. ద్రవిడ్, గంగూలీ, కుంబ్లేకు నో ప్లేస్!
- పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రవిశాస్త్రి
- ఆల్‌టైమ్ టాప్-5 ఇండియా క్రికెటర్లను ఎంచుకున్న రవిశాస్త్రి
- ద్రవిడ్, గంగూలీ, కుంబ్లేకు నో ప్లేస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Shastri All-Time Top-5 Indian Cricketers: ఇటీవల ఇంగ్లండ్ మాజీ కెప్టెన్స్ మైఖేల్ వాన్, అలిస్టర్ కుక్‌లతో కలిసి ‘ది ఓవర్‌లాప్’ క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో టీమిండియా మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి పాల్గొన్నారు. ఈ పాడ్‌కాస్ట్‌లో రవిశాస్త్రి పలు విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆల్‌టైమ్ టాప్-5 ఇండియా క్రికెటర్లు ఎంచుకోవాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్స్ కోరగా.. రవిశాస్త్రి టక్కున సమాధానం ఇచ్చారు. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలు తన ఆల్‌టైమ్ గ్రేట్ అని పేర్కొన్నారు. రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లేలను రవిశాస్త్రి ఎంచుకోకపోవడం విశేషం.
ఐదుగురిలో నంబర్ వన్ ఎవరు? అని అలిస్టర్ కుక్ అడగ్గా.. సునీల్ గవాస్కర్ అని రవిశాస్త్రి బదులిచ్చారు. ‘ఐదుగురిలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ‘బ్యాటింగ్ పరంగా సన్నీ టాప్. కపిల్ దేవ్ అద్భుతమైన ఆటగాడు. అన్ని కోణాల్లో చూస్తే సచిన్ టెండూల్కర్ నంబర్ వన్ ప్లేయర్. 24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడాడు. అతడి తరంలో ప్రతి ఒక్క పేస్ బౌలింగ్ అటాక్‌ను ఎదుర్కొని 100 సెంచరీలు బాదాడు. వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, ఇమ్రాన్ ఖాన్‌లతో పాటు జాక్వెస్ కలిస్, షాన్ పొలాక్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ వంటి టాప్ పేసర్లను అలవోకగా ఆడాడు. నా లిస్టులో బిషన్ సింగ్ బేడి ఉన్నాడు కానీ ఎంఎస్ ధోనీని ఎంచుకున్నా. జస్ప్రీత్ బుమ్రా ఇంకా క్రికెట్‌లో ఉన్నాడు కాబట్టి ఎంచుకోలేను’ అని రవిశాస్త్రి సమాధానమిచ్చాడు.
Also Read
రవిశాస్త్రి ఆల్‌టైమ్ గ్రేట్ టాప్-5 ఇండియా క్రికెటర్లు:
# సునీల్ గవాస్కర్
# కపిల్ దేవ్
#సచిన్ టెండూల్కర్
# ఎంఎస్ ధోనీ
# విరాట్ కోహ్లీ
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!