IND vs ENG: బజ్‌బాల్‌కు భారత్ అస్సలు భయపడదు.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- చారిత్రక విజయానికి అందుకున్న భారత జట్టుపై ప్రశంసలు
- ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ల నుంచి కూడా అభినందనలు
- బజ్‌బాల్‌కు భారత్ అస్సలు భయపడదు అన్న పనేసర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌పై చారిత్రక విజయానికి అందుకున్న భారత జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. టీమిండియా మాజీలే కాదు.. ఇంగ్లండ్‌కు చెందిన మాజీ క్రికెటర్ల నుంచి కూడా అభినందనలు రావడం గమనార్హం. రెండో టెస్టులో భారీ విజయం సాధించిన టీమిండియాను ఇంగ్లీష్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ ప్రశంసించారు. ఇంగ్లండ్ బజ్‌బాల్ క్రికెట్‌కు మిగతా టీమ్స్ జంకుతాయేమో కానీ.. భారత్ మాత్రం భయపడదు అని పేర్కొన్నారు. శుభ్‌మన్ గిల్ అటు కెప్టెన్, ఇటు బ్యాటర్‌గానూ జట్టును ముందుండి నడిపించాడని వ్యాఖ్యానించారు.
ఐఏఎన్ఎస్‌తో మాంటీ పనేసర్ మాట్లాడుతూ… ‘ఈ విజయంతో టీమిండియాలో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ఇంగ్లండ్ బజ్‌బాల్‌కు భారత్ భయపడటం లేదని ఈ మ్యాచ్ ద్వారా తెలుస్తోంది. జట్టుపై మేనేజ్‌మెంట్ చాలా నమ్మకం ఉంది. శుభ్‌మన్ గిల్ అసాధారణ నాయకత్వాన్ని ప్రదర్శించాడు. అలాగే బాగా బ్యాటింగ్ చేశాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియాకు మొదటి టెస్ట్ విజయం ఇది. చరిత్రలో నిలిచిపోయే క్షణాలు ఇవి. ఇక లార్డ్స్‌లో మూడో టెస్టులో ఉత్సాహంతో ఆడుతుంది. సొంత గడ్డపై ఇంగ్లండ్‌ను భారత్ దెబ్బకొట్టింది. ఇక్కడ 20 వికెట్లు తీయడం పెద్ద విషయం. బౌలింగ్ కాంబినేషన్ చాలా బాగుంది. లార్డ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టుతో కలుస్తాడు. అప్పుడు భారత జట్టు బౌలింగ్ ఎటాక్ మరింత బలంగా మారుతుంది’ అని అన్నారు.
Also Read
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
Also Read: Viral Video: బుసలు కొడుతున్న 18 అడుగుల కింగ్ కోబ్రా.. ఈజీగా పట్టేసిన లేడీ ఆఫీసర్!
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కొత్త బంతితో 10 వికెట్లు తీసిన ఆకాష్ దీప్‌ను మాంటీ పనేసర్ ప్రశంసలతో ముంచెత్తారు. ‘కొత్త బంతితో ఆకాష్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడు మంచి సగటును కలిగి ఉన్నాడు. అతడికి అద్భుతమైన పునరాగమనం. రానున్న టెస్టుల్లో కూడా రాణిస్తాడు’ అని పనేసర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ 286 పరుగులు ఇవ్వడం ఆతిథ్య జట్టుకు ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. జూలై 10 నుంచి లార్డ్స్‌లో మూడవ టెస్ట్ ప్రారంభం అవుతుంది.
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!