Dilip Vengsarkar’s criticism of Jasprit Bumrah: వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతాడన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. సిరీస్‌లోని మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఒకటే ఆడనున్నాడు. మాంచెస్టర్ లేదా లండన్ వేదికల్లో జరిగే టెస్టుల్లో ఏ మ్యాచ్ ఆడుతాడు అన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. బుమ్రాను మూడు మ్యాచ్‌లలోనే ఆడించడంపై టీమిండియా మాజీ కెప్టెన్ దిలీప్ అసహనం వ్యక్తం చేశారు. ఓ ఆటగాడు తాను ఆడే మ్యాచ్‌లను ఎంచుకోవడం ఏంటి? అని మండిపడ్డారు.
దిలీప్ వెంగ్‌సర్కార్ టెలికాం ఆసియా స్పోర్ట్‌తో మాట్లాడుతూ… ‘టెస్ట్ క్రికెట్ అత్యుత్తమ ఫార్మాట్. వన్డే, టీ20 ఫార్మాట్‌ల కంటే చాలా ముఖ్యమైంది. భారత్ తరఫున ఆడటం ముఖ్యం. ఎవరైనా ఫిట్‌గా లేకుంటే సిరీస్‌లో ఆడకండి. జస్ప్రీత్ బుమ్రా మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతనికి దాదాపు 7-8 రోజుల విరామం లభించింది. అయినా రెండవ టెస్ట్‌లో ఆడలేదు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. బహుశా అది అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్‌లకు నచ్చి ఉండొచ్చు. నా వరకు టెస్ట్ మ్యాచ్‌లను బౌలర్లు ఎంచుకోవడాన్ని ఇష్టపడను. ఫిట్‌గా ఉండి జట్టుకు అందుబాటులో ఉంటే.. దేశం తరపున అన్ని మ్యాచ్‌లు ఆడాలి. అంతేకాని ఓ ప్లేయర్ ఆడే మ్యాచ్‌లను ఎంచుకోవడం ఏంటి?’ అని ఫైర్ అయ్యారు.
Also Read: IND vs ENG: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆటగాడికి గాయం!
‘జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ స్థాయి బౌలర్. అతడు భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు. మరెన్నో ఉత్కంఠ మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడు. ఓసారి విదేశీ పర్యటనకు వచ్చాక ప్రతీ మ్యాచ్ ఆడాలి. వ్యక్తిగత ప్రాధాన్యత ఆధారంగా మ్యాచ్‌లను ఎంచుకునే అవకాశం ఇవ్వొద్దు. ఫిట్‌గా లేకుంటే సిరీస్ నుంచి ముందే తప్పుకోండి. సిరీస్‌కు ఎంపికయ్యాక అన్ని మ్యాచ్‌లు ఆడాల్సిందే’ అని దిలీప్ వెంగ్‌సర్కార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.