2011లో సరిగ్గా ఇదే రోజు (ఏప్రిల్ 2) కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా రెండో సారి ప్రపంచ విజేతగా నిలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత జట్టు వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. తమ సీనియర్ ఆటగాడు సచిన్‌కు అందమైన బహుమతిని అందజేసింది. భారత్ వేదికగా జరిగిన ఈ ప్రపంచకప్‌లో భారీ అంచనాల నడుమ టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది.
లీగ్ దశలో బంగ్లాదేశ్‌తో తమ ప్రయాణాన్ని ప్రారంభించిన ఫైనల్‌లో శ్రీలంకను మట్టికరిపించి టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. లీగ్ దశలో ఇంగ్లండ్‌తో మ్యాచ్ టై కాగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో మాత్రం ఓటమి పాలైంది. ఈ టోర్నీలో భారత్ ఓడిన మ్యాచ్ ఇదొక్కటే. ఇక క్వార్టర్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను, సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌ను మట్టి కరిపించి సగర్వంగా ఫైనల్ చేరింది. తుది సమరంలో తొలుత శ్రీలంక 274 పరుగులు చేయగా భారత్ 48.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. గౌతమ్ గంభీర్ 97 పరుగులతో రాణించగా.. కెప్టెన్ ధోనీ (91 నాటౌట్) సిక్స్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు.
https://ntvtelugu.com/kane-williamson-out-controversy-in-rajasthan-royals-match/