Ravi Shastri: కోహ్లీ.. దయచేసి ఐపీఎల్ నుంచి తప్పుకో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలు కొనసాగుతున్నాయి. రన్ మెషిన్‌గా పేరు తెచ్చుకున్న కోహ్లీ ఈ స్థాయిలో తంటాలు పడుతుండటం కెరీర్‌లో బహుశా ఇదే తొలిసారి. దీంతో కోహ్లీ వైఫల్యంపై విమర్శలు వస్తున్నాయి. ఒకరకంగా కోహ్లీ టీమ్‌కు భారంగా మారాడనే చెప్పాలి. ఓపెనర్‌గా వచ్చినా, వన్‌డౌన్‌లో వచ్చినా.. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎక్కడా వచ్చినా కోహ్లీ సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అవుతున్నాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది ఐపీఎల్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 128 పరుగులు మాత్రమే చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లతో జరిగిన మ్యాచ్‌లలో అయితే తొలి బంతికే పెవిలియన్ బాట పట్టాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక సూచన చేశాడు. విరాట్ కోహ్లీ వెంటనే ఐపీఎల్ నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకోవాలన్నాడు. ఏకధాటిగా క్రికెట్ ఆడుతున్న కోహ్లీకి కాస్తంత విరామం అవసరమన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ గతంలో జట్టుకు సారథిగా వ్యవహరించిన కోహ్లీకి ఇప్పుడు విశ్రాంతి కావాలని, మైండ్‌ను ఫ్రెష్ చేసుకోవాలని సూచించాడు. తన అంతర్జాతీయ కెరీర్‌ను పొడిగించుకోవాలనుకున్నా.. క్రికెట్‌లో మరికొంతకాలం తనదైన ముద్ర వేయాలన్నా కోహ్లీ తక్షణం ఐపీఎల్ నుంచి తప్పుకోవడమే బెటరని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ ఆటగాడిగా అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికాడు.
Also Read
- WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
- Shai Hope: "మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ".. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
- IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా?
- Naman Dhir: యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డు బ్రేక్.. 6 బంతుల్లోనే నమన్ ధీర్ విధ్వంసం..
కాగా కోహ్లీ ఇలాగే ఆడితే అతడి కెరీర్ ప్రమాదంలో పడే అవకాశముంది. జట్టులో స్థానం కూడా దక్కకపోవచ్చు. మరోవైపు కోహ్లీలో ఆత్మవిశ్వాసం కూడా కనిపించడంలేదు. నాయకత్వ బాధ్యలు భారంగా మారాయని వాటిని వదులుకున్న కోహ్లీ.. ఇప్పుడు ఆ బాధ్యతలు లేకపోయినా సరిగ్గా ఆడలేకపోతున్నాడు. ప్రత్యర్థి జట్ల బౌలర్ల ఉచ్చులో సులభంగా చిక్కుకుంటున్నాడు. రానున్న ప్రపంచ కప్‌లో టీమిండియాకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రధాన అస్త్రాలు. అప్పటిలోగా రికార్డుల రారాజు కోహ్లీ ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
-
Income Tax Jobs 2026: 10th, ఇంటర్ అర్హతతో.. ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, MTS పోస్టులు
-
AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
-
TDP : గుంటూరు మేయర్ పీఠంపై టీడీపీ ఫోకస్.. బరిలోకి లక్ష్మీ అపర్ణ..
-
Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!