గాన కోకిల, ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్‌కు టీమ్ఇండియా ఆటగాళ్లు నివాళి అర్పించారు. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో క్రికెటర్లు తమ భుజాలకు నల్ల బ్యాడ్జీలు ధరించారు. లతా మంగేష్కర్ మరణించారనే వార్త తెలుసుకుని ఆట ఆరంభానికి ముందు ఆటగాళ్లు ఆమెకు నివాళి అర్పించారు. ఈ మేరకు ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. Read Also: గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న గుత్తా జ్వాల, విష్ణు విశాల్ దంపతులు కాగా టీమిండియా ఓవరాల్‌గా…
వెస్టిండీస్ గడ్డపై జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో కుర్రాళ్లు అదరగొట్టడంతో…ఐదోసారి అండర్-19 ప్రపంచకప్ తన ఖాతాలో వేసుకుంది భారత్. ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. చివరగా యువ జట్టు 2018లో కప్పు గెలిచింది. ఇంగ్లాండ్‌తో ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్ వేదికగా శనివారం అర్ధరాత్రి ముగిసిన ఫైనల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన యువ భారత్.. 4 వికెట్ల తేడాతో గెలిచి ఐదోసారి విశ్వవిజేతగా నిలిచింది. 24 ఏళ్ల తర్వాత ఫైనల్‌కి చేరిన ఇంగ్లాండ్‌కి…
ఆదివారం భారత్, వెస్టిండీస్ మధ్య తొలి వన్డే జరగనుంది. కరోనా నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు శిఖర్ ధావన్ దూరం కావడంతో రోహిత్ శర్మతో ఓపెనింగ్‌కు ఎవరు వస్తారో అన్న అంశంపై క్లారిటీ వచ్చింది. తొలి వన్డేలో తనతో పాటు ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాకు వెల్లడించాడు. ఇషాన్ కిషన్ ఒక్కడే ప్రస్తుతం ఆప్షన్‌గా ఉన్నాడని, తనతో పాటు అతడు ఓపెనింగ్ చేయనున్నట్లు రోహిత్ తెలిపాడు. Read Also: కుంబ్లే-కోహ్లీ మధ్య…
టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయని గతంలో ప్రచారం జరిగింది. 2017లో అనిల్ కుంబ్లేను కోచ్ పదవి నుంచి బీసీసీఐ తప్పించింది. అప్పట్లో ఈ వ్యవహారం ఎంత వివాదం సృష్టించిందో తెలిసిందే. 2016లో భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన కుంబ్లే.. రెండేళ్ల కాలం పూర్తవకుండానే ఏడాది తర్వాత తన పదవికి రాజీనామా చేశాడు. కెప్టెన్‌కు తన పద్ధతులతో ఇబ్బందిగా ఉందని తెలిసిందంటూ కుంబ్లే స్వయంగా వెల్లడించడంతో…
అంటిగ్వాలోని కూలిడ్జ్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఆ జట్టు ఫైనల్‌కు చేరడం వరుసగా ఇది నాలుగోసారి. కూలీస్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ , కెప్టెన్ యష్ ధుల్, షేక్ రషీద్ అద్భుతమైన భాగస్వామ్యంతో 290 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఆస్ట్రేలియా జట్టు 194 పరుగులకు పూర్తి 50 ఓవర్లు ఆడకుండానే పెవిలియన్…
వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టులో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. పలువురు టీమిండియా క్రికెటర్లు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. మొత్తం 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని.. బాధితుల్లో శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారని తెలుస్తోంది. క్రికెటర్లతో పాటు టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని జాతీయ మీడియా పేర్కొంది. Read Also: ఆ ఒక్క పరుగు తీయనందుకు.. న్యూజిలాండ్ ఆటగాడికి…
అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ వరుస విజయాలతో అదరగొడుతోంది. శనివారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గత ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ చేతిలో కంగుతిన్న భారత్ ఈ టోర్నీలో బదులు తీర్చుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి 37.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో మెహరూబ్ (30) టాప్‌స్కోరర్. భారత బౌలర్లలో రవికుమార్ మూడు, విక్కీ ఓస్తాల్ రెండు వికెట్లు…
త్వరలో ఇండియాలో వెస్టిండీస్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను వెస్టిండీస్ జట్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్, కోల్‌కతాలలోనే జరగనున్నాయి. అయితే ఈసారి టీమిండియా క్రికెటర్ల కోసం బీసీసీఐ ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయడం లేదని తెలుస్తోంది. కోవిడ్ నేపథ్యంలో విమాన కంపెనీల నుంచి స్పందన రాకపోవడంతో ఈసారి క్రికెటర్ల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసే పరిస్థితులు లేవని బీసీసీఐ చెప్తోంది. Read Also: ఐపీఎల్-15కు…
జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు కూడా అందించాడు. ఈ నేపథ్యంలో మహేంద్రసింగ్ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ ఛాపెల్ ప్రశంసలు కురిపించాడు. ప్రతి జట్టులోనూ ధోనీ లాంటోడు ఒకడు ఉండాలన్నాడు. సహజ వాతావరణంలో క్రికెట్ నేర్చుకున్న వాళ్లే ఎక్కువ కాలం క్రికెట్ ఆడగలుగుతారని.. అలాంటి వాళ్లలో ధోనీ ఒకడని కితాబినిచ్చాడు. Read Also: వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు భారతజట్టు…
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు సెలక్టర్లు భారత జట్టును ప్రకటించారు. రెండు ఫార్మాట్లకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నట్లు వెల్లడించారు. కేఎల్ రాహుల్ రెండో వన్డే నుంచి అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. ఆల్‌రౌండర్ జడేజా ప్రస్తుతం మోకాలి గాయం నుంచి కోలుకుంటున్నాడని.. అందుకే అతడిని సెలక్ట్ చేయడం లేదని పేర్కొన్నారు. మరోవైపు ఈ సిరీస్‌లకు బుమ్రా, షమీలకు విశ్రాంతి ఇస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి ఫిట్‌గా లేని కారణంగా హార్డిక్…