Hardik Pandya: తిరిగి టీమిండియాలోకి రావడం నా చేతుల్లో లేదు.. ఐపీఎల్‌పైనే నా దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో టీమిండియా ఆల్‌రౌండన్ హార్డిక్ పాండ్యా నేతృత్వం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల ద్వారా పాయింట్ల పట్టికలో ఆ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. హార్డిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ వదిలేయడం గుజరాత్ టైటాన్స్‌కు కలిసొచ్చిందనే చెప్పాలి. మహా జట్లను తోసిరాజని టైటిల్ రేసులో గుజరాత్ టైటాన్స్ దూసుకుపోతుందంటే దానికి కారణం హార్డిక్ పాండ్యానే. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్లలోనూ అతడు తనదైన మార్క్ చూపిస్తున్నాడు.
ప్రస్తుత ప్రదర్శనతో త్వరలోనే హార్డిక్ పాండ్యా టీమిండియాలోకి వస్తాడని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో హార్డిక్ పాండ్యా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను మళ్లీ టీమిండియాలోకి వస్తానని భావించడం లేదని.. ఆ అంశం తన చేతుల్లో లేదని హార్డిక్ పాండ్యా వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం తాను ఐపీఎల్ గురించే ఆలోచిస్తున్నానని… వేరే విషయం గురించి పట్టించుకోవడం లేదని స్పష్టం చేశాడు. ఐపీఎల్ తర్వాత తన భవిష్యత్ ఎక్కడికి వెళ్తుందో వేచి చూడాల్సిందేనని, అది తన చేతుల్లో లేదని పేర్కొన్నాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ సాధించి పెట్టడంపైనే తన దృష్టి కేంద్రీకృతం చేశానన్నాడు. ఐపీఎల్‌లో తన ఆటతీరు పరంగా చాలా సంతృప్తిగా ఉన్నానని తెలిపాడు. తన ఆట మెరుగవ్వడంలో కెప్టెన్సీ ఎంతో ఉపకరించిందని వివరించాడు. బాధ్యతలను తీసుకునేందుకు తాను ఇష్టపడతానని.. ఆటను బాగా అర్థం చేసుకున్నప్పుడే విజయం సాధించగలుగుతామని హార్డిక్ పాండ్యా చెప్పాడు.
Also Read
- Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
- Vaibhav vs Ishan: క్రెడిట్ అంతా తీసుకున్నావ్.. వైభవ్ భవిష్యత్ కెప్టెన్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
- CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
తాజావార్తలు
-
Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?