ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో భారత కుర్రాళ్లు కుమ్మేశారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముఖ్యంగా ఓపెనర్ ఇషాన్ కిషాన్ 76 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ మొదటి వికెట్‌కు 6.2 ఓవర్లలోనే 57 పరుగులు జోడించారు. వీరిద్దరూ అవుటైనా శ్రేయస్ అయ్యర్ 36, రిషబ్ పంత్ 29, హార్డిక్ పాండ్యా 31 పరుగులు చేసి రాణించారు. సఫారీ జట్టు బౌలర్లలో కేశవ్ మహరాజ్, నోర్జ్, పార్నెల్, ప్రిటోరియస్ తలో వికెట్ తీశారు. కాగా ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే 212 పరుగులు చేయాలి.