తొలి టీ20 మ్యాచ్‌లో ఓడిన భారత్ జట్టు.. ఈరోజు కటక్‌లో జరగనున్న రెండో టీ20లో గెలిచి సిరీస్‌లో పుంజుకోవాలని ఆశిస్తోంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈరోజు రాత్రి జరగనున్న రెండో టీ20లో మొదట టాస్ గెలిచినా సఫారీలు ఫీల్డింగ్ ఎంచుకొని ,భారత్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించింది. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందే వర్షం ముప్పు ఉన్నట్టు తెలుస్తోంది. గత గురువారం ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా టీమ్.. ప్రస్తుతం ఐదు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ మ్యాచ్‌లో 211 పరుగులు చేసినా.. పేలవ బౌలింగ్ కారణంగా ఓడిపోయిన భారత్ జట్టుపైనే ఇప్పుడు ఒత్తిడంతా ఉంది.
“ఆదివారం సాయంత్రం కటక్‌లో వర్షం పడదని మేము ఖచ్చితంగా చెప్పలేము. తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే భారీ వర్షం పడే ఛాన్స్ లేదు” అని భువనేశ్వర్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్ బిశ్వాస్ పేర్కొన్నారు. ఒక వేళ వర్షం పడినా.. మ్యాచ్‌కు భారీ అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఒడిశా క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు వెల్లడించారు.
ఒడిశాలోని కటక్ వేదికగా ఈరోజు మ్యాచ్ జరగనుండగా.. సుదీర్ఘ విరామం తర్వాత బారాబటి స్టేడియం ఇంటర్నేషనల్ మ్యాచ్‌కి ఆతిథ్యం ఇస్తోంది. కానీ.. ఈరోజు రాత్రి కటక్‌లో వర్షం కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలపడంతో.. మ్యాచ్ సజావుగా జరగడంపై సందిగ్ధత నెలకొంది. అయితే భారత జట్టులో ఎలాంటి మార్పు లేకుండానే బరిలోకి దిగనుంది.
టీమిండియా తుది జట్టు : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (సి), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్
దక్షిణాఫ్రికా తుది జట్టు: క్లాసెన్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, డుస్సెన్, వేన్ పార్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, కగిసొ రబడ, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్ట్జె, తబ్రేజ్ షంసీ.