గత ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత రీతిలో టీమిండియా టెస్ట్ సిరీస్ సాధించిన విషయం ప్రతి క్రికెట్ అభిమానికి గుర్తుండే ఉంటుంది. ఈ సిరీస్ విజయం సాధించడంలో తాత్కాలిక కెప్టెన్ రహానె కీలక పాత్ర వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్ విజయానికి తన నిర్ణయాలు కారణమైతే.. మరొకరు తమ ఘనతగా చెప్పుకున్నారని రహానె విమర్శించాడు. అడిలైడ్ టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ కావడం, ఆ మ్యాచ్ తర్వాత కోహ్లీ స్వదేశానికి తిరిగి రావడం, పలువురు…
ఈరోజు భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొడుతూ తొలి రెండు వన్డేలను అలవోకగా గెలిచిన భారత్ ఇప్పుడు మూడో వన్డేపై కన్నేసింది. ఈ మ్యాచ్ కూడా గెలిచి వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేయాలని భావిస్తోంది. నామమాత్రపు వన్డే కావడంతో… ఈ మ్యాచ్‌లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను పరీక్షించాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న శిఖర్ ధావన్…
టెస్టుల్లో టీమిండియాకు ఆడుతున్న వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కీలక నిర్ణయం తీసుకున్నాడు. బెంగాల్ రంజీ జట్టు నుంచి అతడు తప్పుకున్నాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల తాను రంజీ ట్రోఫీ ఆడటం లేదని బీసీసీఐకి సాహా సమాచారం ఇచ్చాడు. టీమిండియా త్వరలో సొంతగడ్డపై రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు తనను సెలక్టర్లు ఎంపిక చేయరనే విషయం తెలుసుకుని.. మనస్తాపం చెందిన సాహా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యువ ఆటగాడు రిషబ్…
అహ్మదాబాద్ వేదికగా ఈరోజు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉండటంతో ఈ వన్డేను కూడా గెలిచి సిరీస్ చేజిక్కించుకోవాలని టీమిండియా ఆరాటపడుతోంది. మరోవైపు ఈ వన్డేలో గెలిచి సిరీస్ సమం చేసి.. తద్వారా సిరీస్ సాధించాలనే ఆశలను సజీవంగా ఉంచుకోవాలని వెస్టిండీస్ భావిస్తోంది. దక్షిణాఫ్రికాలో పరాభవం తర్వాత రోహిత్ కెప్టెన్సీలో వెస్టిండీస్‌తో ఆడిన తొలి వన్డేలో…
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో వ్యక్తిగత కారణాలతో స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ పాల్గొనలేదు. అయితే రెండో వన్డే కోసం అతడు జట్టుతో చేరిపోయాడు. ఈ మేరకు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. కేఎల్ రాహుల్‌తో పాటు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, కరోనా నుంచి కోలుకున్న బౌలర్ నవదీప్ సైనీ కూడా జట్టుతో చేరారు. దీంతో బుధవారం జరగనున్న రెండో వన్డేలో టీమిండియా తుది జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది. Read Also: పలు ఫ్రాంచైజీలు సంప్రదించాయి..…
అండర్-19 టీమిండియా కెప్టెన్ యష్ ధుల్ మరో అరుదైన ఘనత సాధించాడు. అతడి నేతృత్వంలోని యువ భారత్ ఇంగ్లండ్‌ను ప్రపంచకప్ ఫైనల్లో మట్టికరిపించి ఐదోసారి వరల్డ్ ఛాంపియన్లుగా నిలిచింది. ఈ సందర్భంగా ఐసీసీ యష్ ధుల్‌ను ప్రత్యేకంగా గౌరవించింది. అండర్-19 ప్రపంచకప్ 2022లో విన్నింగ్ కెప్టెన్‌గా నిలిచిన యష్ ధుల్‌ను ఐసీసీ అప్‌స్టోక్స్ మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. Read Also: చారిత్రక వన్డేలో వెస్టిండీస్‌పై భారత్ ఘనవిజయం అండర్-19…
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ దుమ్మురేపింది. 177 పరుగుల విజయలక్ష్యాన్ని 28 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. టీమిండియాకు వన్డేల్లో ఇది 1000వ వన్డే కావడంతో ఈ మ్యాచ్‌ను మరపురాని జ్ఞాపకంగా మార్చుకుంది. Read Also: మాజీ క్రికెటర్ సురేష్ రైనా నివాసంలో విషాదం ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా వెస్టిండీస్…
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు అదరగొట్టారు. బుమ్రా, షమీ లాంటి ఫ్రంట్ లైన్ బౌలర్లు లేకపోయినా వెస్టిండీస్‌ను 43.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియా ముందు 177 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్లుగానే భారత బౌలర్లు వెస్టిండీస్‌ను బెంబేలెత్తించారు. హోల్డర్ (57) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. అతడికి అలెన్ (29) నుంచి సహకారం…
గాన కోకిల, ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్‌కు టీమ్ఇండియా ఆటగాళ్లు నివాళి అర్పించారు. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో క్రికెటర్లు తమ భుజాలకు నల్ల బ్యాడ్జీలు ధరించారు. లతా మంగేష్కర్ మరణించారనే వార్త తెలుసుకుని ఆట ఆరంభానికి ముందు ఆటగాళ్లు ఆమెకు నివాళి అర్పించారు. ఈ మేరకు ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. Read Also: గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న గుత్తా జ్వాల, విష్ణు విశాల్ దంపతులు కాగా టీమిండియా ఓవరాల్‌గా…
వెస్టిండీస్ గడ్డపై జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో కుర్రాళ్లు అదరగొట్టడంతో…ఐదోసారి అండర్-19 ప్రపంచకప్ తన ఖాతాలో వేసుకుంది భారత్. ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. చివరగా యువ జట్టు 2018లో కప్పు గెలిచింది. ఇంగ్లాండ్‌తో ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్ వేదికగా శనివారం అర్ధరాత్రి ముగిసిన ఫైనల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన యువ భారత్.. 4 వికెట్ల తేడాతో గెలిచి ఐదోసారి విశ్వవిజేతగా నిలిచింది. 24 ఏళ్ల తర్వాత ఫైనల్‌కి చేరిన ఇంగ్లాండ్‌కి…