అవినీతి అధికారులపై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మండిపడ్డారు. అవినీతి చేస్తే తానే స్వయంగా ఏసీబీకి పట్టిస్తా అని హెచ్చరించారు. మైదుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా అధికారుల అవినీతిపై బాధితులు తనను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. కొందరు అధికారులు బాగా పనిచేస్తున్నారని, కొందరు మాత్రమే అవినీతికి పాల్పడుతున్నారన్నారు. అవినీతి అధికారులకు మీడియా ద్వారా ఇదే ఫైనల్ వార్నింగ్ అని ఎమ్మెల్యే పుట్టా హెచ్చరించారు. నియోజకవర్గంలో తాను అవినీతి చేయను అని, అధికారులు అవినీతికి పాల్పడితే ఒప్పుకునేది లేదన్నారు. ఎమ్మెల్యే పుట్టా…
కడప ఎస్వీ డిగ్రీ కళాశాల ఆవరణలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరుగుతోంది. ఎమ్మెల్యే మాధవి జాబ్ మేళాను ప్రారంభించారు. రాయలసీమ వ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 52 ప్రైవేట్ కంపెనీలలో 5700 ఉద్యోగాల కోసం సుమారు పది వేల మంది నిరుద్యోగ అభ్యర్థులు హాజరయ్యారు. మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడప నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాసులు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ……
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో హీట్ పుట్టిస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరింది. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి సాధారణ ఎన్నికలను తలపించేలా నడుస్తోంది వ్యవహారం. కూటమి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందట. అలాగే ప్రధాన పోటీదారుగా భావిస్తున్న.. పిడిఎఫ్తోపాటు ఇతర ఉద్యోగ సంఘాలుకూడా తమ అభ్యర్థులను బరిలో నిలిపి.. సవాల్ విసురుతున్నారు.
తాజాగా జరుగుతున్న ప్రచారం గురించి మంగ్లీ సుదీర్ఘ క్లారిటీ ఇచ్చింది. ఆమె షేర్ చేసిన నోట్ లో ఉన్న వివరాలు యధాతధంగా మీ కోసం అందిస్తున్నాం. నన్ను నా పాటను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా కృతజ్ఞతలు. మీ రుణం మంగ్లీ ఎప్పటికీ తీర్చుకోలేనిది. గత వారం రోజులుగా నా పై జరుగుతున్న విష ప్రచారాన్ని చెప్పుకునేందుకు ఈ బహిరంగ లేఖ ద్వారా మీ ముందుకు వచ్చాను. శ్రీకాకుళంలో ప్రతి ఏటా జరిగే…
Vallabhaneni Vamsi Mobile: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంట్లో రెండవ రోజు పడమట పోలీసులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసుల సహాయంతో వంశీ ఇంట్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు.
Kakani Govardhan Reddy: అన్నదాతలఫై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. జగన్ తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు.. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు.. గత ప్రభుత్వంలో ఎకరాకు లక్ష రూపాయలు అదనంగా ఆదాయం వస్తే.. ఇప్పుడు ఎకరానికి రూ. 40 వేల దాకా రైతులు నష్టపోతున్నారు అని పేర్కొన్నారు.
Vallabhaneni Vamsi Wife: విజయవాడలోని సబ్ జైల్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆయన భార్య పంకజశ్రీ ఈ రోజు ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ సబ్ జైల్లో తన భార్తకు ప్రాణహాని ఉందన్నారు.
Vallabaneni Vamshi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశారు. వంశీ మొబైల్ కోసం పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారు. కేసులో ఆధారాల సేకరణ నిమిత్తం హైదరాబాద్ కి రెండు పోలీస్ బృందాలు వెళ్లాయి. ఇప్పటికీ వంశీ మొబైల్ ఫోన్ దొరకలేదు.. దీంతో స్థానిక రాయదుర్గం పోలీసుల సహాయంతో వంశీ ఇంట్లో సెల్ ఫోన్ కోసం గాలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
కూటమి లో గ్యాప్ ఉంది అనేది కేవలం దుష్ప్రచారం మాత్రమే అని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ధర్మవరంలో కూడా పార్టీల మధ్య కూడా ఇటువంటి గ్యాప్ లేదు.. కేవలం క్షేత్రస్థాయిలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయని పేర్కొన్నారు.
మదనపల్లి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళ తన్నులాట పీక్స్ చేరిందని అంటున్నారు. డజన్ మందికి పైగా నేతలు ఈ టికెట్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినా... చివరికి అధినేత చంద్రబాబు మాత్రం మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాషావైపు మొగ్గు చూపారు. దీంతో అసంతృప్తితో ఉన్న మిగతా నేతలు ఎన్నికల్లో షాజహాన్కు సహకరించలేదని చెప్పుకుంటారు. చివరికి కొన్ని చోట్ల ఏజెంట్లను కూడా పెట్టలేదట.