Vallabhaneni Vamshi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన చేసిన భూ అక్రమాలు, అక్రమ మైనింగ్, ఆర్థిక అరాచకాలపై దర్యాప్తు చేయాలని సిట్ కు సర్కార్ ఆదేశాలు ఇచ్చింది.
Roja: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై అందరూ ఆతృతగా ఎదురు చూసారు.. ఆయన ప్రసంగంలో జగన్ ను తిట్టిస్తూ.. చంద్రబాబును పొగిడించుకున్నారు అని వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.
Minister Anagani: జగన్ రెడ్డికి కావాల్సింది ప్రతిపక్ష హోదానే ప్రజా సమస్యలు కాదు అని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. శాసన సభా సభ్యత్వం రద్దవుతుందనే భయంతోనే ఈరోజు జగన్ రెడ్డి సభకు వచ్చారు.. ప్రతిపక్ష నేత హోదా లేకున్నా ఏపీ అసెంబ్లీలో వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నేతలెందరో ప్రజా సమస్యల్నీ సమర్ధవంతంగా లేవనెత్తారు.
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీకి బిగ్ షాక్. వంశీని మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు ఈ రోజు ( ఫిబ్రవరి 24) ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం పది గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. తర్వాత అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై BACలో నిర్ణయం తీసుకుంటారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎంగా చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరువు కాటకాలు వస్తాయని ఆరోపించారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పూర్తిగా తగ్గిపోతాయి.. ఇప్పుడు మిర్చి ధర పతనం అయ్యిందన్నారు. పెట్టుబడి పెరిగిపోయింది, ఉత్పత్తి తగ్గిపోయింది అని అధికారులు ముందే చెప్పారు.. అయినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు జగన్.. మిర్చి రైతుల ఆవేదన తెలుసుకోవడానికి వస్తే గానీ ప్రభుత్వం మిర్చి రైతుల సమస్య గుర్తుకు…
ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్ అని, సీఎం చంద్రబాబులా మోసం చేయడం చేతకాదని వైసీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. ప్రజలను మోసం చేయాలంటే జగన్ సూపర్ సిక్స్ కాదని.. సూపర్ సిక్స్ టీ ఇచ్చేవారని విమర్శించారు. 8 నెలల్లో కూటమి ప్రభుత్వం పరపతి కోల్పోయిందన్నారు. నారా లోకేష్ చేసింది యువగళం కాదని.. నిన్న విశాఖ రోడ్లపై వినిపించింది అసలైన యువగళం అని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలో చేరికలు, వలసలు సర్వ సాధారణం…
పిఠాపురం టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ.... గత ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుని కూటమి పొత్తులో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలిపారు. ఇక ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి తన సంగతి ఏంటని అడుగుతూనే ఉన్నారాయన. వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి ప్రమోట్ చేస్తామని ఎన్నికలకు ముందు స్వయంగా ప్రకటించారు చంద్రబాబు. అటు వర్మకు గౌరవప్రదమైన స్థానం ఇవ్వడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని పవన్ కూడా హామీ ఇచ్చేశారు. అయితే రాష్ట్రంలో…
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. మార్చి 15 నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్ల ఖరారు ఆలస్యం అయింది.
వైయస్ కుటుంబానికి కంచుకోట కడప. ప్రత్యేకించి మున్సిపల్ కార్పొరేషన్లో ఆ కుటుంబం చెప్పిందే వేదం. వాళ్ళ అనుయాయులే అక్కడ కార్పొరేటర్లు. ఇప్పటివరకు మూడు సార్లు ఇక్కడ ఎన్నికలు జరగ్గా.. వైఎస్ కుటుంబ సభ్యులు చెప్పినవాళ్లే.. మేయర్స్ అయ్యారు. అందులో రెండు విడతల నుంచి కొనసాగుతున్నారు కొత్తమద్ది సురేష్ బాబు. ఇలాంటి పరిస్థితుల్లో... పాతికేళ్ళ తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కడప ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్డప్పగారి మాధవి...