మిర్చి రైతులను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శిస్తే తప్పేంటి? అని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ జగన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, జగన్ ప్రజల్లో తిరగకుండా చేసేందుకు భద్రత కుదించారన్నారు. ఇల్లీగల్ యాక్టివిటీస్‌కు భద్రత కల్పించలేమని చంద్రబాబు చెప్పడం దుర్మార్గం అని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వెంకటరామి రెడ్డి ఫైర్ అయ్యారు. తాజాగా గుంటూరు మిర్చి యార్డుకు జగన్ వస్తే.. కూటమి ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వని విషయం తెలిసిందే.
మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. జగన్ ప్రజల్లో తిరగకుండా చేసేందుకు భద్రత కుదించారు. ఇల్లీగల్ యాక్టివిటీస్‌కు భద్రత కల్పించలేమని చంద్రబాబు చెప్పడం దుర్మార్గం. రైతులను పరామర్శించటం చంద్రబాబు దృష్టిలో ఇల్లీగల్ యాక్టివిటీయా?. జగన్‌కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. కావాలనే జగన్ భద్రతపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. మిర్చి రైతులను జగన్ పరామర్శిస్తే తప్పేంటి?. జగన్ పాలనలో 24 పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరలు కల్పించింది. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించటంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు రాజకీయ విలువలు లేవా?. జగన్‌తో ఫోటో దిగిన చిన్నారిపై సోషల్ మీడియాలో టీడీపీ సైకోలు దుష్ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు.