ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. వరుసగా రెండోరోజూ కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నిక వరుసగా వాయిదా పడిన నేపథ్యంలో ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని రాహుల్ మీనా చెప్పారు. వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడం ఇది వరుసగా నాలుగోసారి కావడం విశేషం. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో…
తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ‘చలో తుని’ పిలుపునిచ్చిన నేపథ్యంలోరాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటి వద్ద ఉధృత పరిస్థితి నెలకొంది. రాజా ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. తుని వెళ్లొద్దంటూ రాజాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. తుని వెళ్లకుండా పోలీసులు రాజాను అడ్డుకోవడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దాంతో రాజమండ్రి ప్రకాష్ నగర్లో ఉన్న రాజా ఇంటి వద్ద ఉధృత పరిస్థితి నెలకొంది.…
ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పులివెందుల ఉప ఎన్నికపై ఆసక్తికర చర్చ జరిగింది. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పుణ్య స్నానాలు ఆచరిస్తున్న సమయంలో పులివెందులకు ఉప ఎన్నిక రావాలని బాగా ముక్కుకో అంటూ మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు కామెంట్ చేశారు. ఉప ఎన్నికలు వస్తే మీరే పులివెందులకు ఇన్చార్జిగా రావాలని రామకృష్ణం రాజుకు బిటెక్ రవి సూచించారు. ఉప ఎన్నికలు వస్తే తాను తప్పకుండా పులివెందులకు ఇన్చార్జిగా…
ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ పాలన సాగుతోంది. కూటమి ప్రభుత్వంగా ఒక్కటిగా ఉన్నా.. పార్టీల పరంగా ఎవరిదారిలో వారు వెళ్తున్నారు. రాజకీయంగా బలపడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా ఇటీవలే బీజేపీ కొన్ని చేరికలపై దృష్టి పెట్టింది... మొన్న రాజ్యసభలో కృష్ణయ్య కు అవకాశం ఇచ్చింది.. అలాగే కొంతమంది నేతలను చేర్చుకునే పనిలో పడింది బీజేపీ. అ
తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. మంగళవారం ఉదయం ఎన్నిక నిర్వహిస్తామని చెప్పారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 10 మంది కౌన్సిలర్లు మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు. తమకు రక్షణ కల్పిస్తేనే ఎన్నికకు వస్తామని వైసీపీ కౌన్సిలర్లు ప్రకటించారు. 28 మంది కౌన్సిలర్లలో 15 మంది హాజరైతేనే ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక…
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్గా ఉన్నం భారతి ఎన్నికయ్యారు. కౌన్సిలర్లు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పురపాలక సమావేశానికి మొత్తంగా 17 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. వైస్ ఛైర్మన్గా 30వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ఉన్నం భారతిని కౌన్సిలర్ ప్రతిపాదించగా.. మిగిలిన కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో మొత్తం 33 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మరోవైపు తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికలో…
Srikalahasti: శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఇక, కాళహస్తీ ఆలయంలో 50 రూపాయల టికెట్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసులో విచారణను ఏపీ పోలీసులు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న ఏడుగురు నిందితుల కోసం హైదరాబాద్, విశాఖ పట్నంకు ఏపీ పోలీస్ ప్రత్యేక బృందాలు వెళ్లాయి. నిందితులు ఉపయోగించిన రెండు కార్లు గుర్తించే పనిలో పడ్డారు పోలిసులు.
Kesineni Nani: నందిగామలో మాజీ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను రాజకీయాల నుంచి తప్పుకున్నా ప్రజా సేవలో ఎప్పడు ఉంటాను.. నాకు విజయవాడ అంటే మమకారం పిచ్చి.. విజయవాడ నాకు రెండు సార్లు ఎంపీగా పని చేసే అవకాశం కల్పించింది అని పేర్కొన్నారు.
Minister Kollu Ravindra: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గనులు మరియు భూగర్భ శాస్త్ర మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బందరులో బియ్యం దొంగ పేర్ని నాని ఉన్నాడు అని పేర్కొన్నారు.