Neal Katyal: ట్రంప్‌నకు వ్యతిరేకంగా వాదించి గెలిచింది మనోడే..
- ట్రంప్ టారిఫ్‌లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..
- ట్రంప్‌నకు వ్యతిరేకంగా వాదించింది భారత సంతతి లాయరే..
- ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న నీల్ కత్యాల్ పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neal Katyal: టారిఫ్‌లతో ప్రపంచ దేశాలను భయపెడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు యూఎస్ సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా వాణిజ్య భాగస్వాములపై టారిఫ్‌లు విధించడం ‘‘అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమైన పన్నులు’’ అని అభివర్ణించింది. 6-3 తేడాతో సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. 9 మంది న్యాయమూర్తుల్లో ఆరుగురు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. అంతర్జాతీయ ఆర్థిక అధికారాల చట్టం ద్వారా పెద్ద ఎత్తున దిగుమతులపై సుంకాలు విధించడం సరైంది కాదని స్పష్టం చేశారు.
అయితే, ఈ కేసులో ట్రంపునకు వ్యతిరేకంగా వాధించిన వ్యక్తి గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయవాది నీల్ కత్యాల్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది.1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA)ను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ కత్యాల్ కోర్టులో తన వాదనల్ని వినిపించారు. కోర్టు కూడా దీనికి మద్దతు తెలిపింది. కాంగ్రెస్ అనుమతితోనే పన్నులు విధించాలని, సొంతగా పన్నులు విధించే అధికారం అధ్యక్షుడికి ఉండదని స్పష్టం చేసింది. వాణిజ్యాన్ని నియంత్రించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు (అమెరికా పార్లమెంట్)కు మాత్రమే ఉందని కత్యాల్ తన వాదనల్ని వినిపించారు. ట్రంప్ తన అధికారాన్ని ఇష్టారీతిలో వాడకూడదని వాదించారు.
Also Read
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
నీల్ కత్యాల్ ఎవరు..?
నీల్ కత్యాల్ అమెరికాలో చాలా ఫేమస్ లాయర్. ఈయన కుటుంబం భారత్ నుంచి యూఎస్‌కు వలస వెళ్లింది. చికాగోలో నీల్ జన్మించారు. ఈయన తండ్రి ఇంజనీర్, తల్లి డాక్టర్ వీరిద్దరు కూడా భారత్ నుంచి వలస వెళ్లారు. నీల్ డార్ట్‌మౌత్ కాలేజ్ అండ్ యేల్ లా స్కూల్ నుంచి పట్టా పొందారు. ప్రస్తుతం. మిల్ బ్యాంక్ ఎల్ఎల్పీలో పార్ట్‌నర్‌గా, జార్జ్ టౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. బరాక్ ఒబామా హయాంలో అమెరికా యాక్టింగ్ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు.
నీల్ కత్యాల్ కీలక కేసులు:
అమెరికా సుప్రీంకోర్టులో 50 కన్నా ఎక్కువ కేసులు వాదించిన అనుభం నీల్‌కు ఉంది. 2017లో ట్రంప్ విధించిన ‘‘ట్రావెల్ బ్యాన్’’ను కూడా ఈయనే కోర్టులో సవాల్ చేశారు. అమెరికా న్యాయశాఖ ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘‘ఎడ్మండ్ రాండాల్ఫ్ అవార్డ్’’ను అందుకున్నారు. 2024, 2025 సంవత్సరాల్లో ఫోర్బ్స్ ప్రకటించిన అమెరికా టాప్-200 న్యాయవాదుల జాబితాలో ఈయన ఉన్నారు.
అమెరికాను కుదిపేసిన నల్లజాతీయులు జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో ప్రత్యేక ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. ఓటింగ్ రైట్స్ యాక్ట్ 1965 ఓటింగ్ హక్కుల చట్టం రాజ్యాంగ బద్ధతను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు.
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?