Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక, పోలీసుల పిటిషన్ పై సోమవారం విచారణ జరగనుంది.
అక్రమ కేసులు, కక్షసాధింపు రాజకీయాలు, అధికార దుర్వినియోగం వైసీపీకే సాధ్యం అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆరోపించారు. పగటిపూట రాంబాబు, రాత్రులు కాంబాబు అయిన అంబటికి డీజీపీ ఎదురొచ్చి స్వాగతం పలకాలా అని అడిగారు. అబ్బయ్య చౌదరి పేరుకి సాఫ్ట్ వేర్, మనిషి హార్డ్వేర్ అంటూ మండిపడ్డారు. అలాంటి క్రిమినల్ అయిన అబ్బయ్య చౌదరికి అంబటి వత్తాసు ఏంటి? అని క్వశ్చన్ చేశారు.
Home Minister Anitha: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. వంశీ అరెస్ట్ లో కర్మ సిద్ధాంతం కనిపిస్తోందన్నారు. అతడి అరెస్ట్ అక్రమం కాదు.. సక్రమమే అని పేర్కొన్నారు.
Vallabhaneni Vamsi: కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సుమారు 8 గంటల పాటు గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు ప్రశ్నించారు. కాగా, ఇప్పటికే జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి వైద్య పరీక్షలు పూర్తి కావడంతో.. విజయవాడలోని నాల్గవ అదనపు న్యాయమూర్తి ముందు వంశీని పోలీసులు ప్రవేశ పెట్టారు.
CM Chandrababu: జల వనరుల శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల పని తీరుపై ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు. నిర్ధేశించికున్న లక్ష్యాల మేర పనులు జరగకపోతే.. ఇటు అధికారులు, అటు కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అనుమతులు ఉండి నిధుల సమస్యలేని ప్రాజెక్టుల్లో జాప్యాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
Vallabhaneni Vamsi Arrest: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో తదుపరి చర్యలపై అతడి తరపు న్యాయవాదులు కసరత్తు చేస్తున్నారు. మాజీ అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమాలోచనలు కొనసాగిస్తున్నారు.
Ambati Rambabu: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో అర్థం కాలేదు అని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. వంశీ టీడీపీ కార్యాలయ దాడి ఘటనలో బెయిలుపై ఉన్నారు.. ఆయన అరెస్టు పట్ల అందరం దిగ్భ్రాంతి చెందాం.. టీడీపీ దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన వ్యక్తి మెజిస్ట్రేట్ వద్దకు వెళ్ళి తాను అసలు ఫిర్యాదు చేయలేదని చెప్పారు..
కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వల్లభనేని వంశీ సతీమణి వచ్చారు. వంశీని కలిసేందుకు ఆమెను పీఎస్ లోపలకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.. దీంతో మీడియాతో మాట్లాడియా వంశీ భార్య పంకజశ్రీ.. మమ్మల్ని ఎందుకు లోపలికి అనుమతించడం లేదని క్వశ్చన్ చేశారు.