SVSN Varma: వివాదంగా మారిన టీడీపీ నేత వర్మ ట్వీట్!
- వివాదంగా మారిన టీడీపీ నేత వర్మ ట్వీట్
- కష్టపడి సాధించే విజయానికి గౌరవం అంటూ ట్వీట్
- పవన్ గెలుపు కోసం ప్రచారం చేసిన వర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ట్వీట్ వ్యవహారం వివాదంగా మారింది. ‘కష్టపడి సాధించే విజయానికి గౌరవం’ అంటూ ట్వీట్ చేసిన వర్మ.. కాసేపటికే డిలీట్ చేశారు. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో వర్మ జనసేన జెండాలతో ప్రచారం చేసిన వీడియో షేర్ చేశారు. అయితే ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు. కేవలం పవన్ గెలుపు కోసం వర్మ చేసిన ప్రచారం మాత్రమే ఉంది. అయితే వర్మ కాసేపటికి ట్వీట్ డిలీట్ చేశారు.
సోషల్ ప్లానెట్ సంస్థ తన సోషల్ మీడియా అకౌంట్స్ మెయింటైన్ చేస్తుందంటూ ఎక్స్‌లో ఎస్వీఎస్ఎన్ వర్మ పోస్ట్ చేశారు. సోషల్ మీడియా వీడియోకు, తనకు ఎటువంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. తన పర్మిషన్ లేకుండా తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే తగు చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు వర్మ పర్మిషన్ లేకుండా ట్వీట్ చేశామని సోషల్ ప్లానెట్ సంస్థ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. అయితే పవన్ చివరి నిమిషంలో పిఠాపురం సీటు ఎంచుకోవడంతో.. అక్కడ పోటీకి సిద్ధమైన టీడీపీ సీనియర్ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ తప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాదు పవన్ గెలుపు కోసం పని కూడా చేయాల్సి వచ్చింది.
Also Read
- Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
తాజావార్తలు
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!