కుప్పం టార్గెట్‌గా అధికారపార్టీ వేగంగా పావుల్ని కదుపుతోంది. మేము ఏమైనా తక్కువా అన్నట్టు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోందట టీడీపీ. కుప్పం మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మేము పుంగనూరు సంగతి చూస్తాం అంటున్నారట అక్కడి తెలుగు తమ్ముళ్లు. నిస్తేజంగా ఉన్న పాత ఇంఛార్జ్‌ను పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇచ్చి పెద్దిరెడ్డి పెద్దరికానికి చెక్ పెట్టాలని చూస్తున్నారట. పుంగనూరుపై టీడీపీ ఫోకస్ పెట్టిందా? చిత్తూరు జిల్లా ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకమైంది. మాజీ సీఎం చంద్రబాబు సొంత…
ఆంధ్రా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు.. దూకుడుగా మాట్లాడుతుంటారు. అది పార్టీ వ్యూహమైనా సరే.. వ్యక్తిగత ఆవేశమైనా సరే.. తమ పార్టీని ఎవరైనా విమర్శిస్తే వాళ్లు చూస్తూ ఊరుకోరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా.. ఆ పార్టీ నాయకులు అలాగే ప్రవర్తించారు కూడా. ఇందులో ముఖ్యంగా.. కొడాలినాని, అనిల్ కుమార్ యాదవ్, రోజా వంటి నేతలు.. ఈ దూకుడును ముందుకు తీసుకుపోయారు. ఈ లిస్ట్ లో.. తాజాగా.. అత్యంత నెమ్మదస్తురాలిగా మాట్లాడే… లక్ష్మీపార్వతి సైతం చేరిపోయారు. ఎన్టీఆర్…
అప్పన్న దేవాలయానికి సంబంధించిన భూముల అవకతవకల్లో ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతి రాజు పాత్ర ఉందేమో అన్న అనుమానం కలుగుతోందని…అసలు ఆయన ధర్మకర్త..లేక అధర్మ కర్తా అని ఫైర్ అయ్యారు విజయ సాయి రెడ్డి. సింహాచలం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు రాజ్య సభ సభ్యులు విజయ సాయిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆయన భూములు, దేవాలయంలో ఆస్థులలో అవకతవకలకు పాల్పడకపోతే కోర్టు కు వెళ్లి మళ్ళీ పదవి తెచ్చుకోవడం చూస్తుంటే అదే అనుమానం కలుగుతోందని ఎద్దేవా…
రాజకీయాలు ఎన్నికల్లో చేసుకుందాం.. ముందైతే అభివృద్ధి చేద్దాం అని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం… శ్రీకాకుళం జిల్లా అక్కివరం గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేసిన స్పీకర్ తమ్మినేని.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.. మేం శంకుస్థాపనలు చేస్తుంటే కోర్టులకు వెళ్లి స్టేలు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలు అభివృద్ధి చేస్తుంటే ఇలా చేయడం సరికాదని హితవుపలికిన తమ్మినేని సీతారం..…
పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై లోకేష్ చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయి. లోకేష్ తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. 2016లో స్పెషల్ ప్యాకేజ్ లో భాగంగా పోలవరం అంచనాలు 20వేల కోట్లకు కుదిస్తే చంద్రబాబు సంతకాలు చేశారు. కానీ సీఎం జగన్ సూచనల మేరకు పోలవరం నిధల కోసం పార్లమెంటు సమావేశాలు స్తంభింపచేశాం. ఇటీవలే పోలవరం సవరించిన అంచనాలు 47వేల కోట్లకు కేంద్రం…
మాజీ మంత్రి కుమారుడు ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి తప్పలేదు. ఓడాక.. పార్టీని, కేడర్‌ను ఆయన పట్టించుకోవడం లేదట. పైగా అధికారపక్షానికి దగ్గరవుతున్నారని గుర్రుగా ఉన్నారట తెలుగు తమ్ముళ్లు. ఇంకేముందీ.. ఆయన్ని పక్కన పెట్టేయాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. ఆ రగడేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఓటమి తర్వాత హరికృష్ణ కనిపించలేదని కేడర్ ఆరోపణ! చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు. ఈ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. నాయకత్వ లేమి కారణంగా ఇక్కడ పార్టీకి ఓటమి…
నిన్న మొన్నటి వరకు కూల్ కూల్ అన్నారు. టైమ్ వచ్చేవరకు ఓపిక పట్టాలని ఓదార్చారు. ఏమైందో ఏమో.. ఉన్నట్టుండి కాలు దువ్వుతున్నారు బాబాయ్ అబ్బాయ్. అందరి లెక్కలు రాస్తున్నాం.. తిరిగి చెల్లిస్తాం అని వార్నింగ్‌లు ఇస్తున్నారట. ఎందుకు గేర్ మార్చారు? వాళ్ల రాసుకుంటున్న లెక్కలేంటి? బాబాయ్, అబ్బాయ్‌లకు ఏమైందని తమ్ముళ్ల ప్రశ్న! వైసీపీ గాలిలో కూడా 2019 ఎన్నికల్లో గెలిచి నిలిచారు కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు. టెక్కలి నుంచి అచ్చెన్న ఎమ్మెల్యేగా గెలిస్తే.. రామ్మోహన్నాయుడు శ్రీకాకుళం ఎంపీగా…
వెలిగొండ ప్రాజెక్టు విషయంలో.. ఇటు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ నేతలు.. మరోవైపు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.. ఇప్పుడు హస్తినకు కూడా వెళ్లారు.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ని కలిసింది ప్రకాశం, నెల్లూరు జిల్లాల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యలు, మాజీ శాసనసభ్యలు, నాయకుల బృందం.. వెలిగొండ ప్రాజెక్టు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. వెలిగొండ ప్రాజెక్టును తక్షణమే అనుమతి పొందిన ప్రాజెక్టుగా కేంద్ర గెజిట్‌లో చేర్పించాలని కేంద్ర మంత్రిని కోరిన…
టీడీపీ నేత కూన రవికుమార్‌పై ఏపీ ప్రివిలేజ్ కమిటీ సీరియస్ అయ్యింది.. ప్రివిలేజ్ కమిటీ ముందు కూన రవి హాజరుకాకపోవడాన్ని ధిక్కారంగా భావిస్తున్నామని చైర్మన్ కాకాని గోవర్ధన్‌రెడ్డి అన్నారు.. ఇవాళ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిని ఆదేశించింది ప్రివిలేజ్ కమిటీ.. కానీ, వారు హాజరు కాలేదు.. ఇక, ప్రివిలేజ్ కమిటీ తదుపరి సమావేశం వచ్చే నెల 14వ తేదీన జరపాలని నిర్ణయించారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రివిలేజ్ కమిటీ చైర్మన్…