వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 155 సీట్లు : అచ్చెన్నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాకుళం : ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లో 155 స్థానాలతో టీడీపీ అధికారంలోకి రావడం తధ్యమని స్పష్టం చేశారు. ఇవాళ పెట్రోల్, గ్యాస్ ధరలకు నిరసనగా టీడీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఈరోజు ర్యాలీ జరుగుతుందని నేనసలు అనుకోలేదని… పోలీసులు వైసీపీ కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడు బయటికి రావాలో అచ్చెన్నాయుడుకి తెలుసని… జగన్ ను ఎప్పుడు గద్దె దించాలో కూడా తెలుసని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రతిపక్షపార్టీ నిరసనలను అడ్డుకున్నది లేదని.. కానీ వైఎస్ జగన్ టీడీపీని నాశనం చేయాలనుకున్నాడని ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలను , కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని… అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే టీడీపీ ఉండదనుకున్నారని పేర్కొన్నారు. టెక్కలిలో కొందరు వ్యాపారాల పై దెబ్బ కొడుతున్నారని మండిపడ్డారు. కార్యకర్తలందరూ సహనంగా ఉండాలని.. వచ్చేది టీడీపీ సర్కారేనని తెలిపారు.
Also Read
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
- TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- Tags
- atchannaidu
- cm jagan
- tdp
- ycp
తాజావార్తలు
-
Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
-
JrNTR : ఆదర్శకుటుంబానికి తోడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్
-
Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!