తిరుపతిలో టీడీపీకి కొత్త తలనొప్పి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలే అంతంత మాత్రంగా పనిచేస్తున్న వేళ.. పదవుల పంపకం కేడర్‌కు ఆగ్రహం తెప్పించిదట. పార్టీ జిల్లా పెద్దలు కూడా వారిని పట్టించుకోలేదని టాక్. ఎన్నికల్లో గెలిచిన ఆ ఒక్కరినీ పరిగణనలోకి తీసుకోలేదట. అదే చిత్తూరు జిల్లా టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ గొడవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
టీడీపీ కమిటీల కూర్పుపై కేడర్ ఫైర్!
Also Read
అనుబంధ సంఘాల పదవుల కేటాయింపు తిరుపతి టీడీపీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. పదవుల భర్తీలో సమతూకం పాటించలేదనే విమర్శలు గుప్పుమన్నాయి. పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు లభించలేదని బహిరంగ విమర్శలకు దిగారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నాయకులకు భజన చేసే వారికే పదవులు కట్టబెట్టారని మండిపడుతున్నారు తమ్ముళ్లు. అధిష్ఠానంపై ఆరోపణలు చేయడం ఇష్టంలేని మరికొందరు స్తబ్దుగా ఉండిపోయారు. ప్రస్తుతం ప్రకటించిన కమిటీలను రద్దు చేయాలని తిరుపతిలో టీడీపీకి ఏకైక కార్పొరేటర్‌గా ఉన్న నాయకుడు కూడా డిమాండ్ చేయడం పార్టీలో చర్చగా మారింది.
రెండేళ్లుగా టీడీపీకి దూరంగా ఉన్నవారికి కమిటీలో చోటు?
చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో తెలుగు యువత, తెలుగు విద్యార్థి, మండల కమిటీలను ప్రకటించారు. పార్టీ కార్యక్రమాల్లో ఏనాడూ కనిపించని ముఖాలకు కమిటీలలో చోటు కల్పించారట. 2019లో టీడీపీ ఓటమి తర్వాత చాలా నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్తబ్దుగా ఉండిపోయారు. రాజకీయ ఒత్తిళ్లతో యాక్టివిటీస్ తగ్గించారు మరికొందరు. టీడీపీలో ఉండాలా వద్దా అని ఇంకొందరు ఊగిసలాడుతున్నారట. పార్టీలో పనిచేసేందుకు కొందరు అయిష్టంగా ఉన్నట్టు టాక్. ఇలాంటి కేటగిరీల్లో ఉన్నవారందరికీ కమిటీలలో పదవులు ఇచ్చారని కేడర్ గుర్రుగా ఉందట.
వైసీపీపై పోరాటం చేస్తున్నవారిని గుర్తించలేదా?
రెండేళ్లుగా వైసీపీపై పోరాటం చేస్తున్నవారిని కమిటీలలోకి తీసుకోలేదట. సీనియర్లుగా చెలామణి అవుతున్న వారిని పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. ఈ ఎంపికలపైనే తమ్ముళ్లు పార్టీ నేతలపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారట. వీరికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉన్న ఏకైక కార్పొరేటర్ మునికృష్ణ జత కలిశారట. కష్ట పడేవారికి టీడీపీలో గుర్తింపు లేదా అని ఆయన వేసిన ప్రశ్నలకు సమాధానం లేదట. టీడీపీలో ఉంటూ ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన వారికి పదవులు కట్టబెట్టడంపై నేరుగా చంద్రబాబుకే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. మరి.. చంద్రబాబు దిద్దుబాటు చేపడతారో లేక కేడర్ వేదన ఆరణ్య రోదనగానే మిగిలిపోతుందో చూడాలి.
- Tags
- off the record
- tdp
- Tirupati
తాజావార్తలు
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!